వివాదాలతో ఇటీవల తరచూ వార్తల్లోకెక్కారు ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ. ఎట్టకేలకు అవన్నీ సమసిపోవడంతో ఇప్పుడిప్పుడే ఆమె కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్ని ఆరోపణలొచ్చినా - వివాదాలు ఎదురైనా అఖిలప్రియను సీఎం చంద్రబాబు నాయుడు ఏమీ అనకపోవడం ఆళ్లగడ్డ - నంద్యాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమా కుటుంబానికి గల గట్టి పట్టుకు నిదర్శనం.
తాజాగా అఖిలప్రియ కుటుంబానికి సంబంధించి ఆసక్తికర విషయమొకటి ప్రచారంలోకి వస్తోంది. అదేంటంటే.. తన భర్త భార్గవ్ ను లోక్ సభ ఎన్నికల బరిలో దించాలని అఖిలప్రియ బలంగా కోరుకుంటున్నారట. టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద గట్టిగా ప్రయత్నిస్తున్నారట.
నంద్యాల లోక్ సభ స్థానాన్ని గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ పై వైసీపీ క్యాండిడేట్ ఎస్.పి.వై. రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఈ దఫా కూడా పోటీ ప్రధానంగా టీడీపీ-వైసీపీల మధ్యే ఉండనుంది. నంద్యాలలో భూమా కుటుంబం ప్రాబల్యం ఎక్కువే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ లోక్ సభ సీటు నుంచి తన భర్త భార్గవ్ ను బరిలో దించాలని అఖిలప్రియ భావిస్తున్నారట. ఈ విషయంపై చంద్రబాబుకు అర్జీ పెట్టుకున్నారట. త్వరలోనే ఈ అంశంపై చంద్రబాబు ఏదో ఒకటి తేల్చిచెప్పే అవకాశాలున్నాయి.
అఖిలప్రియ గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ భార్గవ్ కు చంద్రబాబు ఎంపీ సీటు ఇచ్చే అవకాశాల్లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రితో వివాహమైనప్పటి నుంచి ఆళ్లగడ్డ - నంద్యాల ప్రాంతాల్లో బెదిరింపులు - వసూళ్లకు పాల్పడుతున్నారని భార్గవ్ పై పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్గవ్ కు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత ఏమాత్రం అంగీకరించబోరని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు - అఖిలప్రియ జనసేనలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. వీటిలో నిజమెంతో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే!