రెండు భిన్న ధ్రువాల్ని ఒక దగ్గర చేర్చటం కష్టమైన పని. ఒకవేళ అలాంటి పని చేయాలనుకుంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రత్యర్థిపై పట్టు సాధించాలన్న తపనతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ జిల్లాల్లోని బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్ని పార్టీలోకి చేర్చుకోవటం తెలిసిందే. పార్టీలో చేర్చుకోవటం వరకూ బాగానే ఉన్నా.. ఆయా జిల్లాల్లో ఉండే స్థానిక పోరు.. పార్టీకి.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారకూడదన్న విషయంలో అలెర్ట్ గా ఉండాల్సి ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా బాబు చెప్పినా.. అలాంటిదేమీ లేదన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో భూమా.. శిల్పా వర్గీయుల మధ్యనున్న రాజకీయ విభేధాలు ఆ జిల్లా ప్రజలకు సుపరిచితం. అయితే.. జగన్ ను బలహీనం చేయటం కోసం భూమాను టీడీపీలోకి ఆహ్వానిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు చంద్రబాబు. ఆయన తీసుకున్న నిర్ణయంపై పార్టీకి చెందిన శిల్పా బ్రదర్స్ అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని బాబు వారికి మాట ఇచ్చారు.
అయితే.. ఫ్యాక్షన్ పంచాయితీల్లో భాగంగా భూమా వర్గీయులు తాజాగా శిల్పా వర్గానికి చెందిన తులసిరెడ్డి మీద దాడి చేయటం.. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతుండటం సంచలనంగా మారింది. ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య నెలకొన్న అధిపత్య పోరు ఇప్పుడు చంద్రబాబుకు కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చింది. భూమా వర్గీయుల దాడిపై ఫైర్ అయిన శిల్పా బ్రదర్స్ చంద్రబాబును కలిశారు. తమ వర్గీయుడిపై జరిగిన దాడి కచ్ఛితంగా భూమా వర్గీయులే చేయించి ఉంటారంటూ వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఇష్యూ మీద తాను చర్యలు తీసుకుంటానని.. బుధవారం మరోసారి కలుద్దామని శిల్పా బ్రదర్స్ కు నచ్చజెప్పిన చంద్రబాబు వారిని పంపారు. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూ మీద భూమా స్పందించారు. తాజా దాడికి.. తనకు ఏమాత్రం సంబంధం లేదని.. తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరమన్నారు. తాను అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్లుగా చెప్పుకొచ్చారు.