ఊహించనిరీతిలో గుండెనొప్పి రావటం.. ఆసుపత్రికి తరలించిన కాసేపటికే ప్రాణాలు పోయిన భూమా వైనం చాలామందికి షాకింగ్ గా మారింది. మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక నేతలు మరణించటానికి మించిన విషాదం మరొకటి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు.. ఎమ్మెల్యేలు ఉన్నా.. భూమా ఫ్యామిలీ లాంటి కుటుంబాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి.పవర్ ఉన్నా.. లేకున్నా.. ప్రజల అభిమానాన్ని పొందే ఫ్యామిలీలు పరిమితంగానే ఉంటాయి. ఆదివారం ఉదయం పేపర్ చదువుతుండగా.. చాతీనొప్పితో కుప్పకూలిపోయిన భూమా.. నిజానికి ఒక ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లాల్సి ఉండేది.
తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శిల్ప చక్రపాణి రెడ్డి ఎన్నికను తన భుజస్కందాల మీద వేసుకున్న భూమా.. ఆయన గెలుపు కోసం పొద్దుటూరు వెళ్లాల్సి ఉంది. నిజానికి శిల్పా ఫ్యామిలీకి.. భూమా ఫ్యామిలీకి మధ్య రాజకీయ వైరం ఎంతోకాలంగా సాగుతోంది. అయితే.. ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరూ కలిసిపోవాలని సూచించటమే కాదు.. శిల్ప గెలుపును బాధ్యతగా తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించటంతో ఆయన ఓకే చెప్పి..ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేసినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న వేళ.. భూమా కుటుంబానికి సన్నిహితంగా ఉండే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణా రెడ్డి వర్గానికి చెందిన 12 ఓట్లు ఉన్నాయి. వీటిని..టీడీపీ అభ్యర్థి శిల్ప చక్రపాణి రెడ్డికి పడేలా చూడాలని కోరేందుకు భూమా పొద్దుటూరు వెళ్లాల్సి ఉంది. ఆదివారం పొద్దున్నే పొద్దుటూరు ప్రయాణం గురించి గుర్తు చేసినప్పుడు.. ఒంట్లో బాగోలేదని.. కాసేపు చూసి వెళ్దామన్న మాటను చెప్పారని.. అంతలోనే ఇలా జరిగిపోయిందని భూమా సన్నిహితులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/