టీడీపీని దెబ్బేస్తున్న హార్ట్ స్ట్రోక్‌ లు

Update: 2017-04-17 07:37 GMT
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. బ‌ల‌మైన నేత‌లు అనూహ్యంగా హార్ట్ ఎటాక్‌ల‌కు గురై మ‌ర‌ణించ‌టం.. ఇలాంటి ఘ‌ట‌న‌లు నెల వ్య‌వ‌ధిలో రెండు చోటు చేసుకోవ‌టం పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. బ‌ల‌మైన నాయ‌కుల మ‌ర‌ణం పార్టీల‌కు ఎంత న‌ష్టాన్ని చేకూరుస్తాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు.. అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఒక ప్ర‌త్యేక గుర్తింపు దేవినేని నెహ్రూకు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్టీఆర్‌ కు వీరాభిమానిగా.. అప‌ర విధేయుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న త‌ర్వాతి కాలంలో దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి విధేయుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ఎంత అంటే అంత‌న్న‌ట్లుగా ఉండేవారు.

అలాంటి నేత హార్ట్ ఎటాక్‌ తో ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించారు. ఈ మ‌ర‌ణం రాజ‌కీయంగా టీడీపీకి ఇబ్బంది క‌లిగించేదే. వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న మ‌ర‌ణాల‌తో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నెల కింద‌ట క‌ర్నూలు జిల్లా రాజకీయాల్లో త‌న‌దైన ముద్ర‌ను చూపించే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మ‌ర‌ణం షాకింగ్ గా మారితే.. తాజాగా నెహ్రూ మ‌ర‌ణం మ‌రింత బాధించేద‌ని చెప్ప‌క త‌ప్పుదు. ఈ ఇరువురు నేత‌లు హార్ట్ ఎటాక్‌ తోనే మ‌ర‌ణించ‌టం గ‌మ‌నార్హం.

ఈ ఇద్ద‌రు నేత‌లు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లాలో గుర్తింపు ఉన్నవారే కాదు.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్నిఎంతోకొంత ప్ర‌భావితం చేస్తార‌ని చెప్ప‌క త‌ప్పుదు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఈ ఇద్ద‌రు నేత‌లు టీడీపీ నుంచి త‌మ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని షురూ చేసి.. త‌ర్వాత కాలంలో వేరే పార్టీలు మారి.. చివ‌ర‌కు టీడీపీలోకి వ‌చ్చిన కొద్ది కాలానికే మ‌ర‌ణించ‌టం విశేషం. అంతేకాదు.. భూమా.. నెహ్రూ ఇద్ద‌రూ నేర రాజ‌కీయాల‌కు ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా సంబంధాలు ఉన్న‌ట్లుగా విమ‌ర్శ‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా చూస్తే.. బ‌ల‌మైన నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా అనారోగ్య కార‌ణాల‌తో క‌న్నుమూయ‌టం పార్టీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న విషాదాల‌తో ఏపీ అధికార‌ప‌క్షం వేద‌న చెందుతుంద‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News