మరికొద్ది రోజుల్లో తాను మరణిస్తానని భూమా నాగిరెడ్డి ముందే ఊహించారో.. లేక అప్రయత్నంగా ఆయన నోట అలాంటి మాటలు వచ్చాయో కానీ.. గడిచిన నెలరోజులుగా పదే పదే ఆయన నోట మృత్యువు మాటలు వచ్చేవని చెబుతున్నారు. మరణించిన ముందు రోజు రాత్రి జరిగిన ఘటనను భూమా కుమార్తె అఖిల ప్రియ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం శనివారం రాత్రి ఆళ్లగడ్డకు చేరుకున్న ఆయన.. ఇంట్లోకి అడుగు పెడుతూ.. భార్య శోభానాగిరెడ్డిఫోటోను చూస్తూ.. అఖిలప్రియతో.. ‘‘అమ్మ ఫోటో పక్కన నా ఫోటో కూడా పెడితే ఇంకా బాగుంటుంది కదూ’’ అని వ్యాఖ్యానించారట. అంతేకాదు.. గుంటూరులో కడుతున్న ఇంట్లోనూ శోభ ఫోటో పక్కన కూడా తన ఫోటోను అందంగా తయారు చేయించి పెట్టాలని భూమా చెప్పారు.
నెల రోజుల ముందు నుంచే పిల్లలతో తరచూ జాగ్రత్తలు చెప్పటం.. ఎవరిని నమ్మాలి..ఎవరిని నమ్మకూడదు.. ఎవరితో ఎలా మసలుకోవాలి..ఎవరు ఎలాంటి వాళ్లు లాంటి విషయాల్ని తరచూ చెప్పేవారని తెలుస్తోంది. నంద్యాల స్థానిక సంస్థల స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి.. తనకు ఏమాత్రం పొసగని శిల్పా విజయానికి కృషి చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట ఇవ్వటమే కాదు.. ఆ దిశగా బలమైన ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పాచక్రపాణి రెడ్డి కానీ ఓడిపోతే.. తాను సహకరించకపోవటం వల్లే అలా జరిగిందని అనుకునే అవకాశం ఉందని.. అదే జరిగితే తనకు చడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో మరింత జాగ్రత్తగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా చెబుతారు. శిల్ప విజయం కోసం పొద్దుటూరు వెళ్లి రాయబారం చేసేందుకు వెళ్లాల్సిన సమయంలోనే భూమా అకాల మరణం చెందటం గమనార్హం.
భూమా నోటి వెంట తరచూ శోభా ప్రస్తావన వచ్చేదన్న విషయాన్ని భూమా సంతాప తీర్మానం సందర్భంగా పలువురు నేతలు ప్రస్తావించటం గమనార్హం. ఎక్కడకు వెళ్లి వచ్చినా.. రాత్రి పడుకునే ముందు శోభానాగిరెడ్డిఫోటో ముందు దీపం పెట్టాకే నిద్రపోయే వారని నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ చెప్పటం..తన తండ్రి గుండెల్లో శోభ మరణం వెంటాడుతుందన్న విషయాన్ని తాము గుర్తించలేకపోయామని చెప్పటం మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/