వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయి.. ఏపీ అధికారపక్షం టీడీపీలో చేరిన సీనియర్ రాజకీయ నేత.. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆళ్లగడ్డలోని తన స్వగృహంలో ఉన్న ఆయన.. తీవ్ర గుండెపోటుతో కుప్పకూలినట్లుగా చెబుతున్నారు.
దీంతో ఆయన్ను హుటాహుటిన ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. అయితే..భూమా ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన ఆళ్లగడ్డకు దగ్గర్లోని నంద్యాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని నంద్యాల ఎంపీ నియోజకవర్గ పరిధిలోని రాజకీయాల్ని ప్రభావితం చేస్తారన్న పేరు భూమాకు ఉంది. ఆయన సతీమణి శోభానాగిరెడ్డి 2014 ఎన్నికల సమయంలో కారు ప్రమాదానికి గురై మరణించటం తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం తన తండ్రితో పాటు.. ఏపీ అధికారపక్షంలోకి వారు జంప్ అయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/