వైసీపీ నేత - మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి పై హత్యాయత్నం జరగడం కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గీయుడైన అభిరుచి మధు ఈ కాల్పులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. గాల్లో 5 రౌండ్లు మధు కాల్పులు జరపగా శిల్పా వర్గీయులు కాల్పులను అడ్డుకున్నట్లు మీడియాలో పేర్కొంది. చక్రపాణి రెడ్డి తృటిలో తప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామంపై ఓ టీవీ చానెల్ తో ఫోన్ లైన్లో శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు.
నిన్న చనిపోయి వైసీపీ కౌన్సిలర్ భర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ``తిరిగి వచ్చేటప్పుడు చైర్మన్ - తదితరులు కార్లతో వెళ్తున్నాం. దారిలో కౌన్సిలర్ అభిరుచి మధు బండి అడ్డు పెట్టాడు. నా కొడకల్లారా.. మీ అంతు చూస్తామంటూ బెదిరించాడు. గన్ మెన్లను పంపించి బండి తీయాలని కోరితే వారిని కూడా బెదిరించారు. మీరెవర్రా బండి తీయమని చెప్పడానికని ప్రశ్నించారు. పక్కనుంచి వెళ్లడానికి వీలు లేకపోవడంతో బంధువు జగదీశ్వర రెడ్డి వెళ్లి మధుతో మాట్లాడారు. మీ అంతు చూసేందుకే ఉన్నామంటూ కొడవలితో మీదకు వచ్చారు. దీంతో మా వర్గీయులు వారి కారు మీద రాళ్లు వేశారు- కారును తీసుకుని ముందుకు వెళ్లిన మధు మళ్లీ ఆగి బెదిరించారు- మధు గన్ మన్ గన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపాడు`` అని వివరించారు.
ఈ ఘటన జరగడానికి ముందు టూటౌన్ సీఐకి ఫోన్ చేసి చెప్పినా పోలీసులు ఆలస్యంగా వచ్చారని శిల్పా తెలిపారు. ``పోలీసులు వచ్చే గ్యాప్ లోగానే రాళ్లు తీసుకుని దాడికి దిగారు. నాపైనా రాళ్లు తీసుకుని విసిరారు. ఫైరింగ్ మాత్రం పక్కకు చేశారు. రాళ్ల దాడిలో ఎవరికీ దెబ్బలు తగలకున్నా కార్ల మీద పడ్డాయి. పవరుందనే పద్ధతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా వారిని మందలించకుండా పక్కకు తీసుకెళ్తున్నారు. బెదిరిస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. దౌర్జన్యాలు - బెదిరింపులతో రాజకీయాలు చేయకూడదు. గతంలోనూ ఇలా దాడులు చేసిన నేపథ్యంలో వారిని సీఎం - లోకేశ్ పక్కకు పెట్టారు. గతంలో దుర్భాషలాడుతున్న సందర్భంలో టీడీపీ నుంచి సస్పెండ్ కూడా చేశాం.`` అని తెలిపారు. అభిరుచి మధుపై రౌడీషీట్ కూడా ఉందని శిల్పా వివరించారు. భూమా నాగిరెడ్డితోనూ గతంలో మధు గొడవలు పడిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.
తమ తరఫు నుంచి ఎప్పుడూ దాడి చేసిన పరిస్థితులు లేవని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. కానీ దాడులు చేస్తుంటే ఊరుకోకుండా అడ్డుకుంటామా అని ప్రశ్నించారు. ``ప్రభుత్వంలో ఉంటే అందరినీ కొడుతూ - బెదిరిస్తూ ఉంటారా?. ప్రశాంత వాతావరణం లేకుండా చేస్తే ప్రజలు ఎలా బతుకుతారు? కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లే వాళ్లు కత్తులు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎన్నికలు జరిగితే ఆ రోజుతోనే ఘర్షణలు ఆగిపోవాలి- గెలవలేమనే ఫ్రస్ట్రేషన్ తోనే దాడులకు దిగుతున్నారు- మధుకు గెలిపించే శక్తి లేదు, అతడి గురించి మాట్లాడడం కూడా అనవసరం`` అని శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు.