ఆయన భూమన అపశకునం రెడ్డి

Update: 2015-10-20 10:46 GMT
తమను అసలు పిలవనే వద్దని చెప్పి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా ఉంటున్న వైసీపీ నేతలకు ఇప్పుడు కన్ను కుడుతోంది. చంద్రబాబుకు శత్రువులు, తమకు మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి వస్తుండడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తమతో మంచి సంబంధాలున్న నేతలు కూడా తమ వైఖరితో సంబంధంలేకుండా, తమవైపు చూడకుండా చంద్రబాబు పిలవగానే హుషారుగా బయలుదేరి వచ్చేస్తున్నారని వైసీపీ నాయకులు బాధపడుతున్నారు. ఆ దెబ్బకు వారు సమయం, సందర్భం చూసుకోకుండా మాట్లాడి విమర్శలపాలవుతున్నారు.

తాజాగా వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్నవారు ఆయన్నే తిడుతున్నారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న శుభ సమయంలో ఆయన అక్కడి నిర్మాణాలు భవిష్యత్తులో కూలిపోతాయి అంటూ అపశకునాలు మాట్లాడుతున్నారు.

సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని భూమన ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరిట ప్రచారం కోసం దేవుళ్లను సైతం వదలడం లేదన్నారు. వందల కోట్లను సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇందుకు ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

అయితే, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా తప్పులేదు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యకేంద్రమైన అమరావతి నగర నిర్మాణానికి శుభమా అని శంకుస్థాపన చేస్తుంటే అపశకునాలు పలకడం మాత్రం తగదని విమర్శకులు భూమనకు హితవు పలుకుతున్నారు.
Tags:    

Similar News