ఫ్యాక్ష‌న్ సిన్మాల‌కు కార‌కుడు చంద్ర‌బాబు

Update: 2020-01-27 12:18 GMT
ఫ్యాక్ష‌న్ సినిమాలంటే గుర్తొచ్చేది రాయ‌ల‌సీమ ప్రాంతం. సీమ పౌరుషాన్ని వెండితెర‌పై మ‌న సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కులు అద్భుతంగా ఆవిష్క‌రించ‌డంటో పోటీప‌డ్డారు. మీసం తిప్పాల‌న్నా...క‌త్తి చేత‌పట్టి తెగ‌న‌ర‌కాల‌న్నా... తొడ‌గొట్టి స‌వాల్ విస‌రాల‌న్నా సీమ పౌరుషానికే చెల్లింద‌ని ఎన్నో చిత్రాల్లో మ‌న ద‌ర్శ‌కులు చెప్పారు. విజ‌య‌వాడ‌లో కుల రాజ‌కీయాలు రౌడీయిజం గురించి...సీమ‌లో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల గురించి ఆర్జీవీ లాంటి వాళ్లు బ‌హిరంగంగానే మాట్లాడుతుంటారు. త‌న సినిమాల్లో లైవ్ లీగా చూపించారు ఆయ‌న‌. ఇంకా  బి. గోపాల్.. వి. వి.వినాయ‌క్...త్రివిక్ర‌మ్ లాంటి వాళ్లు త‌మ‌దైన శైలిలో సీమ ఫ్యాక్ష‌నిజాన్ని ఎలివేట్ చేసారు. న‌ట‌సింహ బాల‌కృష్ణకు సీమ ఫ్యాక్ష‌నిజంలో చేసిన సినిమాలు హీరోగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి.

అందుకే బాల‌య్య కు సీమ‌లో ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు.  భారీ డైలాగులు చెప్పాల‌న్నా.. ప్ర‌త్య‌ర్ధి ముందు తొడ‌గొట్టాల‌న్నా.. గొడ్డ‌లి ఎత్తి తెగ న‌ర‌కాల‌న్నా ఆ పాత్ర ఔచిత్యాన్ని బ‌ట్టి బాల‌య్యలా  ఒదిగిపోయే మ‌రో న‌టుడు లేనే లేర‌న్న పేరొచ్చింది. ఫ్యాక్ష‌నిస్ట్ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డంలో త‌న‌కి స‌రిలేరు అని నిరూపించారు ఎన్.బీ.కే.  అయితే నేడు జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర్  రెడ్డి ఫ్యాక్ష‌న్ సినిమాలు ఎలా పుట్టాయి? అన్న దానిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు అస‌లు కార‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని...అత‌ని వ‌ల్లే రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం ప‌తాక స్థాయికి చేరుకుంద‌ని ఆరోపించారు.

బాల‌య్య బాబు ఫ్యాక్ష‌న్ పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి త‌మ వియ్యంకుడి  గైడెన్స్ కూడా ఓ కార‌ణం అంటూ అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేసారు. ర‌చ‌యిత‌లు..ద‌ర్శ‌కుల క్రియేటివిటీ వ‌ల్ల సీమ ర‌క్త‌పాతం కాలేదని..చంద్ర‌బాబు వ‌ల్లే సీమ ర‌క్త‌పాతం అయింద‌ని..అలాంటి క‌థ‌ల‌కు ఆద్యుడు  చంద్ర‌బాబు అని ధ్వ‌జ‌మెత్తారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై బాబు గారి రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News