బాబు పాల‌న‌పై భూమ‌న పంచ్ అదిరిందిగా!

Update: 2017-04-18 11:00 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పాల‌న‌పై విప‌క్ష వైసీపీతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా సెటైర్ల మీద సెటైర్లేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో బాబు పాల‌న‌పై సొంత పార్టీ నేత‌లు కూడా ఓ రేంజిలో విరుచుకుప‌డుతున్నారు. చంద్ర‌బాబు సొంత జిల్లాకు చెందిన ఎంపీ శివ‌ప్ర‌సాద్ కూడా బాబు పాల‌న‌పై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. బాబు పాల‌న‌లో ద‌ళితులు తీవ్ర అన్యాయానికి గుర‌వుతున్నార‌ని, అస‌లు సొంత పార్టీకి చెందిన త‌న‌కే బాబు అపాయింట్‌ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే.

అయితే త‌మ‌కు కేబినెట్‌ లో చోటు ద‌క్క‌ని వైనంపై అలక పానుపు ఎక్కిన తెలుగు త‌మ్ముళ్లు కొంద‌రు త‌మ అనుచ‌ర వ‌ర్గాల‌తో ఏకంగా రాజీనామాలు చేయించారు. ఈ త‌ర‌హాలో అసంతృప్తి వ్య‌క్తం చేసిన వారిని దారికి తెచ్చుకునేందుకు ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టి - మ‌ధ్య‌వ‌ర్తుల‌ను పంపిన బాబు... త‌న‌కు బాల్య స్నేహితుడైన శివ‌ప్ర‌సాద్ విష‌యంలో మాత్రం అందుకు విరుద్ధ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. శివ‌ప్ర‌సాద్‌ ను దారికి తెచ్చుకునే అవ‌కాశాల‌ను ప‌క్క‌నపెట్టేసిన బాబు... ఆయ‌న‌కు ఏకంగా తాఖీదులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన వైసీపీ కీల‌క నేత‌ - తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి... బాబు గారి పాల‌న‌పై ఓ రేంజిలో విరుచుకుప‌డ్డారు. అస‌లు చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు ఏమాత్రం సంతోషంగా లేర‌ని వ్యాఖ్యానించిన భూమ‌న‌... బాబు పాల‌న‌లో ఒకే ఒక్క‌రు మాత్ర‌మే సంతోషంగా ఉన్నార‌ని సెటైర్ వేశారు. ఆ ఒకే ఒక్క‌డు ఎవ‌ర‌న్న మీడియా ప్ర‌శ్న‌కు భూమ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

బాబు పాల‌న‌లో సంతోషంగా ఉన్నది ఇంకెవ‌రో కాద‌ని, బాబు గారి సుపుత్రుడు, బాబు గారి కేబినెట్‌ లో ఇటీవ‌లే మంత్రిగా చేరిన నారా లోకేశేన‌ని చెప్పారు. శివప్రసాద్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... ఆయ‌న‌కు షోకాజ్ ఇవ్వడానికి టీడీపీ అధిష్ఠానం సిద్ధప‌డ‌టం సరికాదన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్నే శివప్రసాద్‌ ప్రస్తావించారని భూమ‌న చెప్పారు. ఈ మాత్రానికే శివ‌ప్ర‌సాద్‌ కు నోటీసు జారీ చేయాల‌నుకుంటే... మ‌రి కాపుల గొంతు కోశారని సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల‌పై ఏం చ‌ర్య తీసుకున్నార‌ని భూమ‌న ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News