అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ చేష్టల గురించి ప్రపంచ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా ట్రంప్ గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ మాదిరే చంద్రబాబు సైతం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఒకమాట - తర్వాత ఇంకోమాట - గతం ఒకటి....వర్తమానం ఇంకొకటి అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉన్న విషయం ప్రపంచం అంతా గుర్తిస్తోందని భూమన వ్యాఖ్యానించారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారని భూమన తప్పుపట్టారు. బాబు చేతిలో మోసపోయిన ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చివరకు దివ్యాంగుల జీవితాలతోనూ చెలగాటమాడుతోందని భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. సదరం క్యాంపుల పేరుతో కాలయాపన చేస్తూ దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని - ల్యాప్ టాప్ లు - సైకిళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు హామీలతో మోసపోయిన ప్రజలు తిరగబడాలని భూమన పిలుపు నిచ్చారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్రకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం అడ్డమని సాకులు చెబుతూ కాంట్రాక్ట్ - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని భూమన విమర్శించారు. తెలంగాణలో అడ్డురాని నిబంధనలు ఏపీలో అడ్డొస్తున్నాయా అని నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/