కుటిల రాజకీయం - అవినీతి వంటి విషయాల్లో విమర్శలు - ఆరోపణలు ఉన్నా కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు కొన్ని విషయాల్లో మాత్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు హుందాగా ఉండాలని కోరుకునే నేతల్లో ఆయన ఒకరని చెబుతుంటారు. విశృంఖలత్వం - చెడు వ్యసనాలు - క్రమశిక్షణ రాహిత్యం వంటివాటికి ఆయన స్వయంగా దూరంగా ఉండడమే కాకుండా ప్రజలంతా అలాగే ఉండాలని కోరుకుంటారని చెబుతారు. అయితే... తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం చంద్రబాబు వైఖరి మారుతోందా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ప్రతి సందర్భాన్నీ ఏదో ఒక కార్యక్రమానికి వినియోగించుకుని ప్రచారం పొందాలని తాపత్రయ పడుతున్న ఆయన ఆ దారిలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు అంటే ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14 వరకు విశాఖలో ప్రేమోత్సవం పేరిట భారీ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై విపక్ష వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో చంద్రబాబును ఏకిపడేశారు. చంద్రబాబుకు విదేశీ సంస్కృతిపై మోజు ఎక్కువైందని ఆయన ఆరోపించారు. ప్రేమికుల దినోత్సవం రోజు విశాఖ సముద్రతీరంలో డిస్కో డ్యాన్సులు నిర్వహించాలని యోచిస్తున్నారని ఆరోపించారు. తెలుగువారి మనసంతా ప్రేమతోనే నిండి ఉంటుందని... ప్రత్యేకంగా ప్రేమికుల దినోత్సవం పేరుతో కార్యక్రమాలు అవసరం లేదని మండిపడ్డారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నరని మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలను చేపడితే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
విశాఖలో నిర్వహించే ప్రేమోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా 9వేల ప్రేమ జంటలను ఆహ్వానించనున్నారు. ఈవెంట్ ను పదివేల ఎకరాల్లో నిర్వహిస్తారట. ర్యాంప్ వాక్ లు, బికినీ షో వంటివి ఉంటాయని వినిపిస్తోంది. ఆ సమయంలోనే ఇన్వెస్టర్స్ మీట్ కూడా ఏర్పాటు చేయనుండడంతో ఆడవారి అందాలను ఎరవేసి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చంద్రబాబు నీచ ఆలోచన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ రాష్ట్రంలో విచ్చలవిడితనానికి ఎలాంటి హద్దులు లేవని ఇన్వెస్టర్లకు వివరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా దిగజారిందని ఆరోపిస్తున్నారు. ప్రేమోత్సవం లాంటి కార్యక్రమాలతో విశాఖ సంస్కృతిని నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ మిత్రపక్షం బీజేపీ ఏటా ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తుంది. అలాంటిది చంద్రబాబు మాత్రం ఆ సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ పాప్ గాయని షకీరాను ఇన్వైట్ చేస్తున్నట్లు టాక్. మరి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని పిలుస్తారో లేదో..? సంక్రాంతికి, రంజాన్ కు సంబరాలు జరుపుతున్నట్లే ప్రేమికుల రోజునూ చంద్రబాబు ఘనంగా జరపబోతున్నారన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/