మోదీకి బాబు లేటు 'ఘాటు' లేఖా?:భూమ‌న‌

Update: 2018-10-10 08:34 GMT
2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అశాస్త్రీయంగా విభ‌జించిన నేప‌థ్యంలో న‌వ్యాంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా చాలా అవ‌స‌ర‌మ‌ని అన్ని జాతీయ‌పార్టీలు నొక్కి వ‌క్కాణించిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ కూడా బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పింది. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం....హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని - దానికి బ‌దులు ప్యాకేజీ ఇస్తామ‌ని మాట త‌ప్పింది. ఏపీని వంచించిన మిత్ర‌ప‌క్షం బీజేపీని నిల‌దీయాల్సిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.....హోదా పేరెత్తితే జైల్లో పెడ‌తాన‌ని బెదిరించారు. హోదా ఏమ‌న్నా సంజీవ‌నా అంటూ ఎద్దేవా చేశారు. 2014 నుంచి హోదా అంశాన్ని నీరుగార‌కుండా చేస్తోన్న వైసీపీకి హోదా విష‌యంలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెరగ‌డంతో బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంట‌కాగిన బాబు....ఇపుడు బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, చంద్ర‌బాబుపై వైసీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం - హాదాపై మోదీకి చంద్రబాబు ఘాటుగా లేఖ రాస్తాననడం హాస్యాస్పదమ‌ని భూమ‌న అన్నారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో అంట‌గాకిన చంద్ర‌బాబు నేడు ఇలా మాట్లాడ‌డం విడ్డూర‌మ‌న్నారు. హోదా అంటేనే భూతం, బూతు అన్న‌ట్లు వ్యవహరించిన చంద్ర‌బాబు ఆ విష‌యాన్ని మరిచిపోయి ఉంటార‌ని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా నినాదాన్ని - ఆవశ్యకతను త‌మ అధినేత జ‌గ‌న్ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాతే బాబు యూటర్న్ తీసుకున్నార‌ని అన్నారు. హోదా గురించి మాట్లాడ‌కుంటే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న భయంతో ఆ విష‌యం గురించి మాట్లాడుతున్నార‌ని చెప్పారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్ర‌బాబును ప్ర‌జ‌లు నమ్మే స్థితిలో లేర‌న్నారు. ఇంటికో ఉద్యోగం అన్న చంద్ర‌బాబు...నేడు కొత్త ఉద్యోగాలపై ప్రతిపాదనలే పంపొద్దని చెప్ప‌డం దారుణమన్నారు. లక్షలాది మంది యువ‌త ఉద్యోగాల భర్తీ కోసం ప‌డిగాపులు కాస్తుంటే ...కొత్త ఉద్యోగాల ప్ర‌తిపాద‌న‌లు వ‌ద్ద‌న‌డం చంద్ర‌బాబు దగాకోరుతనానికి నిద‌ర్శ‌న‌మని అన్నారు. హెచ్ ఓడీలకు ఖాళీల ప్రతిపాదనలు పంపొద్దనడం నిరుద్యోగులను మోసం చేయడమేన‌ని భూమ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News