తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రానున్న మరో మూడు టర్మ్స్ లో కచ్ఛితంగా జగన్ ప్రభుత్వాలే ఏర్పాటు అవుతాయన్న వాదన జోరుగా వినిపిస్తున్న వేళ.. ఆయనకు సన్నిహితులందరికి కీలక స్థానాలు కట్టబెడుతూ జగన్ నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. ఇలాంటి వేళ.. ఎవరూ ఊహించని ప్రకటన చేసి సంచలనంగా మారారు భూమాన.
త్వరలో ప్రకటించే జగన్ కేబినెట్ లో భూమానకు స్థానం పక్కా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అంశాన్ని మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా.. తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించటం మంత్రి పదవికి కంటే గొప్ప విషయంగా అభివర్ణించారు. తిరుపతిలో టీడీపీపై గెలవటం అంటే అంత చిన్న విషయం కాదన్న భూమానా.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.
ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ప్రకటించిన భూమన.. గతంలో ఏ సీఎం చేయని రీతిలో పని చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎన్నికల బరిలో ఎందుకు నిలవనన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. తిరుగులేని గెలుపు ఖాయమన్న వేళలో.. ఎన్నికల్లో పోటీకి దూరం కావటం విశేషం.