మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడితే ఆ ఎంపీపై వేటు పడనుందా..? పీసీసీ అధ్యక్షుడు రేవంతుకి పక్కలో బళ్లెంలా మారి తరచూ వివాదాస్పదమవుతున్న ఆ నేతపై అధిష్ఠానం సీరియస్ గా ఉందా..? పార్టీకి నష్టం కలిగించే వారిని ఉపేక్షించకూడదని డిసైడ్ అయిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీ ఎవరో ఈపాటికే అంచనా వేసి ఉంటారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పార్టీ బాధ్యతలు దక్కకపోవడంతో ఆది నుంచీ అసంత్రుప్తిగానే ఉన్నారు. పీసీసీ పదవిని రేవంత్ ఓటుకు నోటులాగా కొనుక్కొన్నారని.. దీనికి పార్టీ ఇంచార్జి మాణికం ఠాగూర్, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ సహకరించారని బహిరంగంగానే ఆరోపించారు. దీనిపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకదశలో అధిష్ఠానం ఆయనపై వేటు వేయాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకుందని సమాచారం.
అయితే.. దేశ మొత్తంమీద పార్టీకి తక్కువ మంది ఎంపీలు ఉండడం.. సానుకూల వాతావరణం ఉన్న తెలంగాణలో ఒక ఎంపీని ఎందుకు తగ్గించుకోవడం అన్న భావనలో వెంకటరెడ్డిని ఉపేక్షించిందట. అధిష్ఠానం బలహీనతలను అలుసుగా తీసుకున్న ఆయన సంవత్సరం నుంచీ రేవంతుపై తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వరంగల్ లో రాహుల్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తే దానికీ డుమ్మా కొట్టారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే మునుగోడు ఉప ఎన్నికలో వెంకటరెడ్డి వ్యవహరిస్తున్న వైఖరి పార్టీ నేతలకు అస్సలు మింగుడుపడడం లేదు. ఎప్పుడో రేవంత్ అన్న ఎస్పీ, హోంగార్డు వ్యాఖ్యలను తనకు ఆపాదించుకొని వాటినే ఎత్తి చూపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంతు క్షమాపణ చెప్పినా కూడా వెంకటరెడ్డి బెట్టు వీడడం లేదు. అదీకాకుండా తన తమ్ముడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ గెలుపు కోసం పరోక్షంగా పనిచేస్తున్నారని ద్వితీయ శ్రేణులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
రాజగోపాల్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లడానికి వెంకటరెడ్డే కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముందుగా సోదరుడిని బీజేపీలోకి పంపి.. ఉప ఎన్నిక తర్వాత తానూ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.
ఇదే కనుక నిజమై మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే వెంకటరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడానికి ఏఐసీసీ మానసికంగా సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. మిగతా అసమ్మతి నేతలకు కూడా ఇది ఒక హెచ్చరికగా ఉండబోతోందని అధిష్ఠానం భావనగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.