మరో రెండేళ్ళల్లో ఎన్నికలు ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సినది 2024 మేలో మాత్రమే. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రబాబు ప్రకటన చేయడం వెనక పెద్ద వ్యూహాలే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే మూడేళ్ల వ్యవధిలో ఏపీలో టీడీపీ బాగానే పుంజుకుంది అంటున్నారు. గతంలో వైసీపీ చేతిలో పోగొట్టుకున్న జిల్లాలలో ఇపుడు పసుపు పార్టీ దశ తిరిగింది అంటున్నారు.
ఉత్తరాంధ్రా నుంచి మొదలుపెడితే చాలా జిల్లాలలో అధికార పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది. అదే టైమ్ లో ఏపీలో ఆల్టర్నేషన్ గా టీడీపీయే కనిపిస్తోంది. ఇక 2019 ఎన్నికల్లో విజయనగరం, కర్నూల్, కడప జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇపుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారింది అంటున్నారు.
విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లు ఉంటే అందులో సగానికి సగం గెలుచుకునే పరిస్థితిలో టీడీపీ ఉంది. అలాగే కర్నూల్ లో చూస్తే మొత్తం పద్నాలుగు సీట్లకు గానూ ఈ నాలుగైదు సీట్లు సైకిల్ పరం అవుతాయని లేటెస్ట్ సర్వేలు తెలియచేస్తున్నాయి. కడపలో గత ఎన్నికల్లో ఒకక్ సీటూ రాని టీడీపీకి ఈసారి మాత్రం రెండు నుంచి మూడు సీట్లు అయినా దక్కుతాయని అంటున్నారు.
ఇక అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉంటే ఇందులో 2019లో రెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది కానీ ఇపుడు ఎన్నికలు వస్తే కచ్చితంగా ఆ నంబర్ నాలుగు నుంచి అయిదు వరకూ పెరుగుతుంది అంటున్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఒక్కరు మాత్రమే గెలిచారు. ఈసారి మాత్రం కచ్చితంగా నాలుగు సీట్లు గ్యారంటీ అంటున్నారు.
నెల్లూరులో కూడా వైసీపీ ఆధిక్యం ఇప్పటిదాకా ఉండేది. ఒక్కడ ఇపుడు సైకిల్ జోరు చేస్తోంది. దాంతో కనీసం మూడు సీట్లు పట్టుకెళ్ళడం ష్యూర్ అంటున్నారు. ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లు ఉంటే ఇక్కడ టీడీపీ మెజారిటీ సీట్లు అంటే ఎనిమిది గెలుచుకుంటుందని ఖాయంగా చెబుతున్నారు.
గుంటూర్లో మొత్తం పదిహేడు సీట్లు ఉంటే అందులో ఏడు సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయని అంటున్నారు, క్రిష్ణా జిల్లాలో పదహారు సీట్లకు గానూ వైసీపీ టీడీపీ చెరి సగం గెలుచుకుంటాయని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలల్లో మొత్తం 34 సీట్లు ఉంటే ఇక్కడ కూడా వైసీపీ కంటే కూడా జనసేన టీడీపీ కూటమే ఎక్కువ సీట్లు సాధిస్తుంది అని తెలుస్తోంది. విశాఖలో పదిహేను సీట్లు ఉంటే అందులో మెజారిటీ అంటే ఎనిమిది సీటు టీడీపీ ఖాతాలో పడతాయని లేటెస్ట్ సర్వే చెబుతోంది.
శ్రీకాకుళంలో మొత్తం పది సీట్లు ఉంటే చెరి సగం వైసీపీ టీడీపీ పంచుకుంటాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే కచ్చితంగా టీడీపీ 23 నుంది డెబ్బై సీట్ల దాకా సాధించడం ఖాయమనే చెబుతున్నారు. అదే టైమ్ లో వైసీపీ దాదాపుగా యాభై సీట్లు కోల్పోయి వందకు నంబర్ పడిపోతుంది అని ఒక తాజా సర్వే అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకూ వాస్తవం అన్నది పక్కన పెడితే ఏపీలో టీడీపీ బలపడుతోంది అన్నది మాత్రం అంతా అంగీకరిస్తున్నారు. అదే టైమ్ లో వైసీపీ జాగ్రత్తపడాలన్న సంకేతాలు కూడా ఈ లేటెస్ట్ సర్వే ద్వారా వస్తున్నాయి.