ఆయన అమెరికా అధ్యక్షుడు. ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశానికి అధినేత అంటే.. ఇంచుమించు ప్రపంచాన్ని శాసించే స్థాయి అన్న మాట. అలాంటి స్థానంలో ఉన్న అధ్యక్షులు చాలా సందర్భాల్లో సింపుల్ గా వ్యవహరిస్తుంటారు.
సామాన్యులతో మమేకం కావటం కనిపిస్తుంటుంది. తాను అధ్యక్ష స్థానాన్ని చేపట్టినప్పటి నుంచి అప్పుడప్పుడు ఆసక్తికర పనులు చేసే బైడెన్ తాజాగా అలాంటిదే మరొకటి చేశారు.
కాలిఫోర్నియాలోని ఇర్విన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు అమెరికా అధ్యక్షుల వారు.
ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట.. ఒక టీనేజర్ కు ఆయన ఇచ్చిన డేటింగ్ సలహాకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకూ సదరు బాలికకు బైడెన్ సలహా ఎందుకు ఇచ్చినట్లు? అలాంటి సందర్భం ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే..
అధ్యక్షుల వారితో ఫోటోలు దిగేందుకుకాలేజీ విద్యార్థులు ఆసక్తిని చూపించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు అధ్యక్షుల వారితో ఫోటోకు దిగారు. ఈ సందర్భంగా తన ముందు నిలబడిన టీనేజర్ భుజం మీద అప్యాయంగా చేయి వేసిన బైడెన్.. ముప్ఫైఏళ్లు వచ్చే వరకు సీరియస్ రిలేషన్ షిప్ లోకి వెళ్లొద్దు అంటూ సలహా ఇచ్చారు. అధ్యక్షుల వారి నుంచి వచ్చిన ఈ సలహాతో ఆమె ఒక్కసారిగా ఎలా రియాక్టు కావాలో అర్థం కాలేదు.
తన మనవళ్లు.. మనవాళ్లకు చెప్పే మాటనే ఆమెకు చెబుతున్నట్లుగా చెప్పిన బైడెన్.. 30 ఏళ్లు వచ్చే వరకుసీరియస్ రిలేషన్ షిప్ లోకి వెళ్లొద్దన్న సలహాకు సదరు టీనేజర్ స్పందిస్తూ.. తాను దాన్ని పరిగణలోకి తీసుకుంటానన్న రీతిలో రియాక్టు అయ్యారు. అయితే.. అధ్యక్షుల వారి మాటలకు నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది.
బైడెన్ తీరుతో సదరు బాలిక అసౌకర్యానికి గురైందన్న మాటను కొందరు చెబితే.. మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని.. అనూహ్యంగా డేటివ్ సలహాను అధ్యక్షుల వారి నోటి నుంచి రావటంతో ఎలా రియాక్టు కావాలో అర్థం కాలేదే తప్పించి.. ఆమె ఏమీ అసౌకర్యానికి గురి కాలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. బైడెన్ నోటి నుంచి వచ్చిన డేటింగ్ సలహా ఆసక్తికకరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View
Full View Full View