జో బైడెన్ కీలక నిర్ణయం .. వైట్ హౌస్ లో అడుగుపెట్టనున్న మరో ఇద్దరు ప్రవాస భారతీయులు !

Update: 2020-12-23 09:44 GMT
గత కొన్ని రోజుల ముందు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై భారీ విజయాన్ని అందుకున్న జో బైడెన్ , అమెరికా కొత్త అధ్యక్షుడిగా జనవరి 20 న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే .. బైడెన్ తన టీం లో భారతీయ అమెరికన్లకు స్థానం క‌ల్పిస్తూ.. త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ.. అరుదైన‌ గౌర‌వాన్ని అందిస్తున్నారు. మ‌రో సారి త‌న టీంలోకి మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చేరారు. ఈ క్ర‌మంలో ప్ర‌వాస భార‌తీయులైన వినయ్‌ రెడ్డి, గౌతమ్‌ రాఘవన్‌లకు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు.

తనకు దీర్ఘ కాలంగా సహాయకుడిగా ఉన్న వినయ్‌ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌ గా నియమించగా, గౌతమ్‌ రాఘవన్ ‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో రాఘవన్‌ వైట్ ‌హౌస్‌ లో సీనియర్‌ అధికారిగా విధులు నిర్వహించారు. వారితో పాటు నిర్వహణ, పరిపాలన డైరెక్టర్‌ గా అన్నె ఫిలిపిక్‌, షెడ్యూలింగ్‌ అండ్‌ అడ్వాన్స్డై రెక్టర్ ‌గా ర్యాన్‌ మోంటోయా, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గా బ్రూస్‌ రీడ్‌, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కు సీనియర్‌ సలహాదారుగా ఎలిజబెత్‌ విల్కిన్స్‌లను బైడెన్‌, కమలా హారిస్‌ నియమించారు. ఇప్పటికే కమలా హారిస్ ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్ ‌ను బడ్జెట్ చీఫ్‌ గా, వేదాంత్ పటేల్ ‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బైడెన్ తన టీమ్‌ లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

ఇక వినయ్‌ రెడ్డి, రాఘవన్ ‌లతో పాటు మరో నలుగురికి బైడెన్ తన టీమ్‌ లో చోటు కల్పించారు. వీరిలో గతంలో ఒబామా టీమ్ ‌లో పనిచేసిన అన్నె ఫిలిపిక్ ఉండగా.. ఆమెకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డైరెక్టర్, మేనేజ్‌ మెంట్.. ర్యాన్ మోంటోయా అనే ఒబామా మాజీ స్టాఫ్‌ కు డైరెక్టర్‌ ఆఫ్ షెడ్యూలింగ్ అండ్‌ అడ్వాన్స్ బాధ్యతలు అప్పగించారు. బైడెన్‌ తో చాలాకాలంగా పనిచేస్తున్న బ్రూస్ రీడ్‌కి డిప్యూటీ చీఫ్ స్టాఫ్, ఎలిజబెత్ విల్‌ కిన్స్ ‌ని చీఫ్ స్టాఫ్‌ సీనియర్ అడ్వైజర్ ‌గా నియమించుకున్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ..నూతనంగా నియమితులైన అధికారులు తనతో కలిసి పాలసీలను రూపొందించడంలో అమెరికాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తారని వెల్లడించారు.
Tags:    

Similar News