రాజకీయాలు ఇపుడు బొత్తిగా బాగాలేవు. ఎందుకంటే అంతా బురద రాజకీయాలే. ఎదుటి వారి మీద కాసింత బురద జల్లేసి ఆ మీదట వారినే కడుక్కోమనడం ఒక తమాషా అయిపోయింది. నిజం ఏదో నింద ఏదో తెలియదు కానీ జనంలో మాత్రం అంతా వెళ్ళిపోయి బురద బురద అయిపోతుంది. అలాంటిదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ ఆరోపణ.
ఒక పధకం ప్రకారం వైసీపీ ఈ ఆరోపణ చేస్తూ వచ్చిందని రాజకీయాలు తెలిసిన వారు అంటారు. నిజానికి ప్యాకేజి తీసుకుని పవన్ చంద్రబాబుతో జట్టు కట్టారని వైసీపీ అనవచ్చు కాక. దానికి ఆధారాలు ఏవి అంటే జవాబు ఉండదు. ప్యాకేజి ఒకరు ఇచ్చారు రెండవవారు పుచ్చుకున్నారు. అయితే అది వన్ టూ వన్ గా కడు రహస్యంగా సాగిపోయే వ్యవహారం అయినపుడు బయటకు ఎలా తెలుస్తుంది. అంటే అలా చేస్తున్నది పూర్తిగా ఆధారం లేని ఆరోపణలే అని కొంచెం బుర్ర ఉన్న వాడికి ఎవడికైనా అర్ధం అవుతుంది.
అయితే ఈ రకంగా ఆరోపణలు చేస్తూ పోతున్నా మొదట్లో ఖండించలేకపోవడం జనసేన రాజకీయ బలహీనత అయితే ఇపుడు ఖండించినా ఆ బురద వదలకపోవడం ఒక విషాదం. ఎవడురా నన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నది అని ఆ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గట్టిగా గర్జించారు. ఇంకా చెప్పాలంటే తొలిసారి గర్జించారు. వైసీపీని గద్దించారు. చెప్పు కూడా చూపించి కాస్తా అనుచితమైన వ్యాఖ్యలే చేశారు.
అయినా సరే ప్యాకేజ్ స్టార్ అని అంటూనే ఉన్నారు. మంత్రులు అంతా అదే పనిగా పొలిటికల్ ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఎలా. ఇదే ఇపుడు జనసేనతో పాటు పవన్ మీద అభిమానం ఉన్న ఒక బలమైన సామాజికవర్గంలోనూ చర్చగా ఉంది. అందుకే కాపు సంక్షేమ సేన పేరిట కొందరు నాయకులు కొత్త ఎత్తు వేశారు. అది నిజంగా వ్యూహమే కూడా.
వారు డిమాండ్ చేస్తున్నది పవన్ని కాదు, వైసీపీని అంతకంటే కాదు, ఏకంగా చంద్రబాబుని. అవును తెలుగుదేశం అధినేత చంద్రబాబునే కాపు సేన డిమాండ్ చేస్తోంది. పవన్ని ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని అంటూంటే ఖండించాల్సింది చంద్రబాబే కదా అని కరెక్ట్ లాజిక్ నే పట్టుకుని సేన తరఫున నాయకులు కోరుతున్నారు. ప్యాకేజి బాబు నేను పవన్ కి ఎందుకు ఇస్తాను అసలు అలాంటి మాటలేంటి, తప్పు కదా. ఎక్కడ ప్యాకేజి నేను ఇచ్చాను, పవన్ ఎక్కడ పుచ్చుకున్నారు ఎవరు చూశారు అంటూ బాబు లాంటి సీనియర్ నేత గట్టిగా ఖండిస్తే విశ్వసనీయత ఉండడమే కాదు వైసీపీకి సరైన జవాబుగా ఉంటుందని కాపు సంక్షేమ సేన అంటోంది.
బాబు మీడియా ముఖంగా వచ్చి పవన్ మీద వస్తున్న ఈ రకమైన ప్యాకేజ్ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఆ పని చేస్తారా. కాపుల ఓట్లు అవసరం తెలుగుదేశానికి. పైగా జనసేనతో పొత్తు కూడా కావాలి. మరి అలాంటపుడు ప్యాకేజ్ అన్నది కూడా ఏమీ లేదు అన్నపుడు బాబు వంటి పెద్ద మనిషి వచ్చి ఖండిస్తే వైసీపీ నేతల నోళ్ళు మూతపడతాయి అని అంటున్నారు. చూడాలి మరి బాబు ఏం చేస్తారో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.