వైసీపీ హైక‌మాండ్‌లో పెద్ద ఎత్తున కొట్లాట‌!.. విజ‌య‌సాయి బాధ్య‌త‌ల మార్పు!

Update: 2022-04-27 07:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న పంచాయ‌తీల‌నే తేల్చ లేక ఇబ్బందులు ప‌డుతు న్న స‌మ‌యంలో ఇప్పుడు ఏకంగా పార్టీ అధిష్టానంలోనే పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయ‌ని తా డేప‌ల్లి వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌.. జిల్లాల‌కు బాధ్యుల‌ను ఏర్పా టు చేశారు. అదేవిధంగా పార్టీలో కో ఆర్డినేట‌ర్ల‌ను కూడా నియ‌మించారు. అయితే.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి కుటుంబానికి దాదాపు 60 నియోజ‌క‌వ‌ర్గాల‌ను చేతిలో పెట్టారు.

అయితే..పార్టీలో కీల‌కంగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల‌కు మాత్రం.. పెద్ద‌గా ప్రాధాన్యత లే కుండా పోయింద‌నే టాక్ వ‌చ్చింది. దీంతో కొంత‌లో కొంత మార్పు చేయాల‌ని భావించిన జ‌గ‌న్‌.. విజ‌య సాయిరెడ్డి బాధ్య‌త‌ల్లో మార్పులు  చేశారు. ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ అనుబంధ విభాగాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌తో పాటు.. రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్స్, జిల్లా అధ్య‌క్షులు.. అనుబంధ సంఘాల‌కు ఆయ‌న‌ను హెడ్‌ను చేశారంట‌. అదేవిధంగా మ‌రో కీల‌క నేత‌.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి.. ఎమ్మెల్యేలపై అజ‌మాయిషీ, ప‌ర్య‌వేక్ష‌ణ‌ను అప్ప‌గించార‌ట‌.

అదేవిధంగా స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌కు మీడియా బాధ్య‌త‌లు ఇచ్చార‌ని స‌మాచారం.. మొత్తానికి విజ‌య‌సాయి రెడ్డి సాధించుకున్నార‌ని.. రాబోయే రోజుల్లో మ‌ళ్లీ సాయిరెడ్డి చ‌క్రం తిప్ప‌బోతున్నాడ‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ అయితే.. జరుగుతోంది.

ఇక‌, సాయిరెడ్డి మ‌నుషులు.. లోలోన సంబ‌రాలు కూడా చేసుకుంటున్నార‌ని స‌మాచారం. ఇక‌, మ‌రో కీల‌క నాయ‌కుడు.. సీఎం జ‌గ‌న్‌కు సొంత బాబాయి అయిన‌.. వైవీ సుబ్బారెడ్డికి అత్యంత కీల‌క‌మైన‌.. విశాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. ఇక్క‌డ ఆయ‌న హవా చూపించి.. పార్టీని విజ‌యం దిశ‌గా న‌డిపించాల్సి ఉంటుంది.

ఇక‌, పెద్దిరెడ్డి, ఆయ‌న కుమారుడికి ఏకంగా 60 నియోజ‌క‌వ‌ర్గాలు ఇచ్చారు అని.. వైవీ చేతిలో త‌క్కువ స్థానాలు ఉన్నాయ‌ని కూడా వాళ్ల మ‌నుషులు గుస‌గుస‌లాడుతున్నారు. ఇబ్బంది కూడా ప‌డుతున్నారు అని అంటున్నారు. ఇలా వైసీపీ హైక‌మాండ్‌లోనే స‌ర్దుబాటు చేసుకోలేక పోతే.. ఎలా అని.. ఈ సారి పీకే కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు అని.. అన్నారు క‌దా! కాబ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్లు అంతా క‌లిసి.. చేస్తేనే వైసీపీ గ‌ట్టు ఎక్కుతుంద‌ని లేక‌పోతే.. టీడీపీ వాళ్లు ఈ సారి.. గ‌ట్టిగా చేయాల‌ని డిసైడ్ చేస్తున్నారంట‌.

వైసీపీ హైక‌మాండ్ 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం.. ప‌ని చేశారు. కాబ‌ట్టి.. భారీ విజ‌యం సాధించారు. కానీ.. ఈ సారి కూడా చేయాలి.. అప్పుడే విజ‌యం సాధ్య‌మవుతుంద‌ని.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News