ఆగస్టు 5 న అమెరికాలో 'అయోధ్య రాముడు' దర్శనం !

Update: 2020-07-30 14:00 GMT
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయబోతున్నారు. భారతదేశ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం. దీన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండేలా నిర్వాహకులు భిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. అయోధ్య లో రామమందిర పూజ నిర్వహించే సమయంలో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్యేర్ లో ప్రధాన వీధులన్నీ శ్రీరాముడి నిలువెత్తు 3 డీ చిత్రాలతో నిండి పోనున్నాయి. అలాగే అయోధ్యలోని ఆలయ నమూనాను కూడా భారీ పోర్ట్రైట్లతో హైలైట్ చేయనున్నామని . బిల్ బోర్డులన్నీ వీటితో కళకళలాడనున్నాయని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహ్వానీ ప్రకటించారు.

దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయి. 17 వేల చదరపు అడుగుల ఎత్తయిన ఎల్ ఈ డీ డిస్ ప్లే స్క్రీన్ తో బాటు ఇక్కడి ఇతర స్క్రీన్లను కూడా ఇందుకు వినియోగిస్తామని, ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు ‘జై శ్రీరామ్’ అనే పదాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ స్క్రీన్లలో కనిపించేలా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ భూమి పూజ చేస్తున్న ఫోటోలు, ఇమేజీలను దాదాపు నగరమంతా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని జగదీష్ సెహ్వానీ చెప్పారు. మోదీ హయాంలో రామాలయ నిర్మాణం జరగడం ఓ అద్భుత ఘట్టం.. ఇన్నాళ్లకు ప్రజల కల తీరబోతోంది.. ఆరేళ్ళ క్రితం కూడా ఇలాంటి రోజు వస్తుందని మేం ఊహించలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు
Tags:    

Similar News