టీడీపీకి కంచు కోటలుగా ఉత్తరాంధ్రా జిల్లాలను చెప్పుకుంటారు. అయితే ఇపుడు వాటిలో చాలా చోట్ల వైసీపీ పాగా వేసింది. అధికార బలం అండతో లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించినా కూడా ఇంకా టీడీపీ గట్టిగా పోరాడిన చోట తన సత్తాను చూపిస్తూనే ఉంది.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు లాంటి ప్రాంతం. వరసబెట్టి అనేక ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఘన విజయాలు సాధించింది. అయితే వైసీపీ ఏర్పాటు అయ్యాక సీన్ మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీయే వరసగా గెలిచింది.
అయినా సరే టీడీపీ గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తాజాగా పాతపట్నంలోని హీరమండలం జెడ్పీటీసీకి జరిగిన ఎన్నికల్లో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు కుమారుడు వైసీపీ అభ్యర్ధి రెడ్డి శ్రావణ్ కుమార్ ని టీడీపీ అభ్యర్ధి పొగిరి బుచ్చిబాబు ఓడించడం విశేషం. మెజారిటీ వంద లోపు వచ్చినా కూడా ఈ కీలక సమయంలో అధికార పార్టీ మీద టీడీపీ జెండా ఎత్తి ఓటమి రుచి చూపించడం అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి.
దీనికి గల కారణాలు ఏంటి అంటే టీడీపీ ఇక్కడ సమిష్టిగా పోరాడింది. అంతే కాదు కసిగా పనిచేసింది. పట్టు ఏ మాత్రం చేజార్చుకోరాదని మాజీ ఎమ్మెల్యే కలమట రమణమూర్తి, ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు విపరీతంగా ప్రచారం చేశారు. క్యాడర్ లో పూర్తి జోష్ నింపారు.
వైసీపీ అధికార పార్టీ అయితేనేమి టీడీపీ గెలవాల్సిందే అంటూ కొత్త పాఠాలు చెప్పారు. ఫలితంగా ఇపుడు ఎమ్మెల్యే కుమారుడే ఓడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్ ఓడిపోవడానికి మరో కారణం ఆయన స్థానికంగా అందుబాటులో ఉండరు అన్నది. ఎక్కడో ఢిల్లీలో ఉంటూ చుట్టపు చూపుగా పాతపట్నానికి వచ్చే శ్రావణ్ ని గెలిపిస్తే ప్రజలకు ఒరిగేది లేదని కూడా టీడీపీ నేతలు నొక్కి చెప్పారు.
ఇక రెడ్డి శాంతి మీద కూడా ప్రజల్లో ఇదే విషయం మీద వ్యతిరేకత గట్టిగా ఉంది. ఆమె కూడా ఎమ్మెల్యేగా గెలిచినా ఎపుడూ ఢిల్లీలోనే ఉంటారని, వీలు దొరికినపుడు మాత్రమే పాతపట్నానికి వస్తారని విమర్శలు ఉన్నాయి. రెండున్నరేళ్ళు అయినా ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని, ఆమె జనంలోకి కూడా పెద్దగా రావడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి.
మరి జగన్ కి అత్యంత సన్నిహితురాలు అయిన ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ఉన్నారు. ఆమెకు జగన్ పార్టీ పరంగానే కాదు, ప్రభుత్వ పరంగా కూడా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ మధ్యనే రెడ్డి శాంతి కుమార్తె ఇంట్లో వివాహం జరిగితే జగన్ హాజరయ్యారు.
మరి ఇంతలా వైసీపీ ఆమెకు ప్రయారిటీ ఇస్తున్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతపట్నంలో పట్టు కోల్పోవడం అంతే దారుణమే అని చెప్పాలి. ఇక్కడ కలమట కుటుంబానికి మొదటి నుంచి బాగా జనాల మద్దతు ఉంది. ఈ కుటుంబమే టీడీపీ నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది.
ఇపుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి రెడ్ సిగ్నల్స్ వచ్చిన నేపధ్యంలో మరోమారు కలమట రమణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచేందుకు చురుకుగా పావులు కదుపుతున్నారు. వైసీపీ స్థానిక ఫలితాలు చేసిన హెచ్చరికతో తప్పులు సరిద్దుకోకపోతే ఈ సీటు పోవడం తధ్యమని అంటున్నారు. అలాగే రెడ్డి శాంతి పూర్తిగా జనాలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ నేతల నుంచి కూడా సూచనలు వస్తున్నాయి.