దీపావళి సందర్భంగా చైనాకు దిమ్మ తిరిగిందా ?

Update: 2022-10-26 04:45 GMT
దీపావళి పండుగ సందర్భంగా డ్రాగన్ కు మన ప్రజలు పెద్ద షాకిచ్చారా ? గతంలో ఎప్పుడూ లేనివిధంగా చైనా వస్తువులు ప్రధానంగా టపాకాయలను మన ప్రజలు కొనలేదట. హోలు మొత్తంమీద చైనా వస్తుల వైపు జనాలు చూడకపోవటం వల్ల డ్రాగన్ కు సుమారు రు. 75 వేల కోట్ల నష్టం జరిగిందని ఒక అంచనా.

మామూలుగా ప్రతి దీపావళి సందర్భంగా రెండురోజుల పాటు ప్రజలంతా సెంటిమెంటుగా భారీఎత్తున షాపింగ్ చేస్తుంటారు. థంతేరస్ అని దీపావళి సందర్భంగా దేశం మొత్తంమీద  అక్టోబర్ 22, 23 వ తేదీల్లో రు. 45 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ మొత్తంలో రు. 25 వేల కోట్లు బంగారం కొంటే మిగిలిన రు. 20 వేల కోట్లకు ఆటోమొబైల్, కంప్యూటర్లు, కంప్యూటర్ గాడ్జెట్లు, ఫర్నీచర్, హోం అప్లయెన్స్, ఆఫీసు డెకరేషన్, స్వీట్లు, డ్రైఫ్రూట్లు, కిచెన్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్ ఐటమ్స్ కొనుగోలు చేశారట.

థంతేరస్ సంరద్భంగా జనాలు భారీఎత్తున గోల్డ్ కాయిన్స్, జ్యూవెలరీ తదితరాలను కొనుగోలు చేసినట్లు కన్ఫెడరేషన్ ఆప్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఒక ప్రకటనలో చెప్పింది. రకరకాల వస్తువుల మీద జనాలు వేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు కానీ హోలు మొత్తంమీద టపాకాయలపై చేసిన ఖర్చు తక్కువనే చెప్పాలి. మామూలుగా అయితే టపాకాయల కోసమే వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తారు.

మనదేశంలో దీపావళి సందర్భంగా జరిగే వ్యాపారాన్ని చూసిన తర్వాత చైనా మనదేశంపై కన్నేసింది.  టపాకాయలు, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను విపరీతంగా ఎగుమతిచేస్తోంది. మనజనాలు కూడా చైనా వస్తువులు చీపుగా వస్తున్నాయని బాగా అలవాటు పడిపోయారు.

అలాంటిది ఈసారి చైనా వస్తువుల జోలికే పెద్దగా వెళ్ళలేదట. కారణాలు ఏవైనా కానీండి చైనా ఉత్పత్తులకు చాలా దూరంగా జరిగారట. దాంతో సుమారు రు. 75 వేల కోట్ల వ్యాపారాన్ని చైనా నష్టపోయిందని కాన్ఫడరేషన్ జాతీయ కమిటి ప్రకటించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News