మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్దవ్‌ఠాక్రే పదవికి గండం ఏర్పడనుందని తెలుస్తోంది. అప్పట్లో మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా ఠాక్రే ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు. అయితే ఆయన అంతకుముందు ఎలాంటి సభల్లో ప్రతినిధి కాదు. ఎప్పుడు రాజకీయాలను శాసిస్తుంటాడు. కానీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో ఆయన పదవికి గండం ఏర్పడే అవకాశం ఉందని పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. ఆరు నెలల్లో ఏదైనా చట్టసభల్లో సభ్యుడు కావాలి. ఆ గడువులోపు సభ్యుడు కాకపోతే ఆ పదవి నుంచి తొలగిపోవాల్సిందే.
ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే.. ప్రస్తుత కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ సమయంలో ఆ వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ సమయంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ ఆ మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి విన్నవించారు.
గతేడాది నవంబర్ 28వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సీఎంగా ఎన్నికవడంతో మే 28వ తేదీతో ఆరు నెలలు అవుతుంది. శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆరు నెలలు ముగుస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ గవర్నర్‌కు నివేదిక పంపారు. అతడు ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఆమోదించి వెంటనే ఎమ్మెల్సీగా నియమించాలి. అయితే ఆ తీర్మానాన్ని ఆమోదించకపోతే ఆయన పదవికి రాజీనామా తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ముగిసినా మే 28వ తేదీలోపు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయో లేవో అనేది తెలియడం లేదు.
ప్రస్తుతం మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 1,135 కరోనా కేసులు నమోదు కాగా, 72 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ముగిసినన అనంతరం ఎన్నికలు జరుగుతాయో లేవోనని సస్పెన్స్ కొనసాగుతోంది.