జగన్ అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అని అంటారు. కానీ ఒక్కోసారి తీసుకున్న నిర్ణయాలు రాంగ్ అయి చివరికి పార్టీకి బూమరాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్ ఒకటి తలిస్తే మరొకటి జరిగిన సందర్భాలు ఉన్నాయి. జగన్ పార్టీలో 2014లో చేరి చివరి నిముషంలో టీడీపీ లోకి ఫిరాయించిన రఘురామ క్రిష్ణం రాజును 2019 ఎన్నికల వేళ జగన్ పార్టీలో చేర్చుకుని నర్సాపురం టికెట్ ఇచ్చారు. చివరికి జరిగింది ఏంటి అంటే ఆయన గెలిచిన నాటి నుంచే చుక్కలు చూపిస్తూ వచ్చారు.
ఇక ఇపుడు చూస్తే లేటెస్ట్ గా జగన్ తీసుకున్న మరో కీలక నిర్ణయం మీద పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాజ్యసభకు నలుగురిని పంపించే చాన్స్ లక్కీ జగన్ కి వచ్చింది. అలాంటపుడు పార్టీకి కష్టించి పనిచేసిన వారిని, మొదటి నుంచి ఉన్న వారినీ తీసుకోకుండా ఆయన కొన్ని సామాజిక లెక్కలు వేసుకుని మరీ అనూహ్యంగా ముగ్గురుని ఎంపిక చేశారు. ఆ ముగ్గురిలో ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి ఒకరు.
ఆయన జగన్ తో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నారు. పైగా జగన్ తోనే కలసి నడుస్తారు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఆయన తెలంగాణా వాసి. ఇక్కడే ఈయన అభ్యర్ధిత్వం పట్ల కొంత వివాదం వచ్చింది. ఇక ఆర్ క్రిష్ణయ్య. ఈయన బీసీ నేత. అయితే ఈయన ఎంపికను జగన్ ఫక్తు ఓట్ల రాజకీయాల్లో భాగంగా చేశారని టాక్. ఏపీలో గుత్తమొత్తంగా బీసీల ఓట్లు క్రిష్ణయ్య వేయిస్తారు అని భావించి ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ పదవి ఇచ్చారు.
కానీ క్రిష్ణయ్య పోకడలు, ఆయన విషయం చూసిన వారు ఎవరైనా ఆయన వైసీపీకి పెద్దగా ఉపయోగపడతారు అని అనుకోవడంలేదుట. ఆయన బీసీ కార్డు తెలంగాణాలోనే తుస్సుమన్న వేళ ఏపీలో ఏ విధంగా బీసీల ఓట్లను కదిలించగలరు అన్న చర్చ వస్తోంది. ఇక క్రిష్ణయ్య రాజకీయ వైఖరి చూస్తే ఆయన టీడీపీ నుంచి మొదట ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. అటునుంచి టీయారెస్ కి కూడా ఉప ఎన్నికల వేళ మద్దతు ఇచ్చారు.
ఇలా మూడు పార్టీలు ఆరు అభిప్రాయాలతో ఉన్న క్రిష్ణయ్యకు సీతయ్య అని కూడా పేరుంది. ఆయన ఎవరి మాట వినరు తనకు తోచిన తీరున వ్యవహరిస్తారు అని అంటారు. ఇక రాజ్యసభలో తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా క్రిష్ణయ్య వ్యతిరేకిస్తారని, అది ఏపీలో వైసీపీకి రాజకీయంగా నష్టదాయకంగా మారుతుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆయన కడదాకా ఒకే పార్టీలో కొనసాగిన దాఖలాలు లేవు
ఈ రోజు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. దాంతో జగన్ని ఆయన పొగుడుతున్నారు. రేపటి రోజున జగన్ అధికారంలకి రాకపోతే ఇదే క్రిష్ణయ్య వైసీపీతోనే పూర్తిగా ఉంటారా అన్నది చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. అప్పటికి ఆయనకు నాలుగేళ్ల రాజ్యసభ పదవి ఇంకా మిగిలే ఉంటుంది కూడా. సో క్రిష్ణయ్యతో బిగ్ ట్రబుల్స్ ఉంటాయని అవి ఫ్యూచర్ లో జగన్ ఫేస్ చేయవచ్చు అని కూడా అంటున్నారు.
ఒకనాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ రోజు క్రిష్ణయ్య ఘాటుగా విమర్శిస్తున్నారు. రేపటి రోజున జగన్ని కూడా అదే విధంగా విమర్శించరన్న గ్యారంటీ ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇక మరో రాజ్యసభ ఎంపీగా బీద మస్తాన్ రావు ఉన్నారు. ఈయన ఫక్తు పారిశ్రామికవేత్త. పైగా ఆయన రాజకీయ జీవితం అంతా టీడీపీతోనే కొనసాగింది. ఆయనకు ఈ రోజున కూడా టీడీపీలో మంచి దోస్తులు ఉన్నారు. ఆయన తమ్ముడు స్వయంగా బీద రవిచంద్ర టీడీపీలో కీలకమైన రోల్ పోషిస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా టీడీపీతో బంధాలు ఉన్న బీద మస్తాన్ రావు 2024లో జగన్ కనుక మళ్లీ అధికారంలోకి రాకపోతే తన విధేయతను డెఫినిట్ గా మార్చుకుంటారు అని అంటున్నారు.
ఆయన మళ్లీ టీడీపీలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు అని కూడా అంటున్నారు. అపుడు ఆయన మీద అనర్హత వేటు అంటూ వైసీపీ ఆయాసపడినా వృధా ప్రయాస తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. ఇక రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న కేసీయార్ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ విషయంలో ఇదే తప్పు చేశారు. ఆయన్ని రాజ్యసభకు పంపించి ఆ తరువాత లాక్కో లేక పీక్కోలేక అన్నట్లుగా ఆయనతో ఇబ్బందులు పడ్డారు అని గుర్తు చేస్తున్నారు.
మరి జగన్ అయితే రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో చాలా లైట్ తీసుకుని పార్టీ కాని వారికి అత్యున్నత పదవులు కట్టబెట్టి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిని సైడ్ చేశారు. ఇపుడు వీరు నిజంగా చివరిదాకా జగన్ వెంట ఉంటారా అంటే అందరికీ ఒకే భావన ఉందిట. అదేమంటే కొత్తగా నెగ్గిన నలుగురు రాజ్యసభ ఎంపీలలో ఇద్దరు మాత్రమే జగన్ కి వీర విధేయులుగా ఎప్పటికైనా ఉండే చాన్స్ ఉంది. ఆ ఇద్దరే విజయసాయిరెడ్ది నిరంజన్ రెడ్డి, మరో ఇద్దరు బీద మస్తాన్ రావు కానీ ఆర్ క్రిష్ణయ్య కానీ కచ్చితంగా జగన్ కి తలనొప్పులు కలిగించే అవకాశాలు మెండుగానే ఉంటాయని అంటున్నారు. సో రాంగ్ డెసిషన్ తీసుకున్న జగన్ దానికి తగిన పరిహారాన్ని వచ్చే రోజుల్లో చెల్లిస్తారా అంటే ఏమో చూడాలి.