ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్: మరో ఐదుగురికి నోటీసులు.. రిమాండ్ పొడిగింపు

Update: 2022-11-25 09:45 GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓ వైపు నిందితుల రిమాండ్ పొడిగించగా.. మరోవైపు కొత్తగా మరికొంతమందికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్ , సింహయాజీల రిమాండ్ ను డిసెంబర్ 9 వరకూ పెంచుతూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. జగ్గు స్వామి సోదరుడితోపాటు ఆయన సిబ్బందికి కూడా సిట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం.

ఇప్పటికే ఈ కేసులో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసులు నమోదు చేశారు. అంతేకాదు మరో ఇద్దరు కేరళకు చెందిన తుషార్, జగ్గూజీపై కూడా సిట్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈణెల 26 లేదా 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ ముగ్గురికి మరోసారి నోటీసులు అందజేసింది.  ఈ కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఇది రెండోసారి.. ఈనెల 16న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు.

అయితే ఆ నోటీసులు ఆయనకు అందాయో లేదో సమాచారం తెలియరాలేదు. ఈనెల 21న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ బీఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు నోటీసులు అందాయో లేదోనన్న అనుమానం నెలకొంది.

ఈ కేసులో ఏ1గా రామచంద్రభారతి, నందుకుమార్ ఏ2గా, సింహయాజీ ఏ3గా ఉన్నారు. కాగా ఏ4గా బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, ఏ5గా తుషార్, ఏ6గా జగ్గుజీస్వామి , ఏ7గా బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాను సిట్ చేర్చింది.

ఇక తాజాగా జగ్గుస్వామి సోదరుడితో సహా ఐదుగురికి సిట్ నోటీసులు అందజేసింది. జగ్గుస్వామి సోదరుడు మణిపాల్, అలాగే ఆయన ఆశ్రయంలోని సిబ్బంది శరత్, ప్రశాంత్ మరికొంత మందికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల నిందితులను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కలిశాడని ఆరోపణలు వచ్చాయి. వారితో మంతనాలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను విచారణకు పిలిచినట్టు సమాచారం. బీజేపీ ఏజెంట్లకు.. రఘురామకు ఏంటి సంబంధం అని అందరూ ఆరాతీస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News