బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ మందా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కోపం.. ఆవేశంతో పాటు దూకుడు కూడా ఎక్కువగా ఉండే కౌశల్ తన అటిట్యూడ్ తో బిగ్ బాస్ హౌస్ లో అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. ఒక దశలో షోలో బిగ్ బాస్ ను సైతం ఆత్మరక్షణలో పడేసిన వైనాన్ని మర్చిపోకూడదు. అలాంటి కౌశల్ తాజాగా బీజేపీలో చేరారు.
ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కౌశల్ సతీమణి నీలిమ కూడా పార్టీలో చేశారు. బీజేపీలో చేరటం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు కౌశల్. ప్రధాని మోడీ.. కేంద్రమంత్రి అమిత్ షా నాయకత్వంలో పని చేయటానికి తానెంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు.
ఇంతకాలం సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న కౌశల్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన తీరు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారుతుందని చెప్పక తప్పదు. సెలబ్రిటీగా ఉన్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను రాజకీయాల్లోనూ కంటిన్యూ చేస్తారా? అన్నది క్వశ్చన్ గా మారింది.