అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఫలితాలకు కీలకమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం షురూ అయ్యింది. తొలి రౌండ్ ముగిసే నాటికి 44 స్థానాల ఫలితాల వెల్లడి చూస్తే ఎన్డీయే జోరు మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఈ 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధిక్యత కనపర్చింది.
ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక మీడియా సంస్థలు జేడీయూ నేతృత్వంలోని లౌకిక మహాకూటమి వైపే మొగ్గారు. అదే సమయంలో మీడియాలో ప్రముఖంగా కనిపించే ఎన్డీటీవీ.. ఎగ్జిట్ ఫలితాల్లో తమదైన ముద్ర చూపించే చాణక్య.. సిసిరోలు మాత్రమే ఎన్డీయే వైపు మొగ్గారు. తాజా ఫలితాల సరళి చూస్తే.. మొదటి పంచ్ మోడీ బ్యాచ్ దేనన్నట్లుగా ఉంది. ఎన్డీయే 31 స్థానాల్లో.. మహా కూటమికి 12 స్థానాల్లో అధిక్యంలో ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ విజయం దిశగా పయనిస్తున్నారు. మరోవైపు మరో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ సైతం అధిక్యంలో ఉన్నారు. తొలి పంచ్ ఎన్డీయే కూటమిది అయిన నేపథ్యంలో.. ఈ ఊపును కొనసాగిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.