అమర జ‌వాన్ కుటుంబానికి ఇచ్చిన చెక్ బౌన్స్

Update: 2017-05-10 15:53 GMT
ఒక దురుదృష్ట‌క‌ర‌మైన‌వార్త ఇది. దేశం కోసం ప్రాణాలిచ్చే అమ‌ర‌వీరుల‌కు మ‌న ప్ర‌భుత్వాలు ఇచ్చే గౌర‌వంపై సందేహాలు క‌లిగించే సంద‌ర్భం. మొన్న సుకుమాలో జ‌రిగిన మావోయిస్టుల దాడిలో మ‌ర‌ణించిన ఓ అమ‌ర‌వీరుడి కుటుంబానికి ఇచ్చిన చెక్కు బౌన్స‌యింది. ఈ ఘ‌ట‌న‌లో మర‌ణించిన కానిస్టేబుల్ రంజిత్‌ కుమార్ కుటుంబం.. త‌మ‌కు బీహార్ ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.5 ల‌క్ష‌ల చెక్కును డిపాజిట్ చేసింది. త‌మ అకౌంట్లో డ‌బ్బు జ‌మ‌కాలేద‌ని మూడు, నాలుగుసార్లు బ్యాంకు చుట్టూ తిరిగితే.. చెక్కు బౌన్స‌యింద‌ని అధికారులు చెప్పారు. రంజిత్‌ కుమార్‌ కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

స‌మాజం కోసం ప్రాణ‌త్యాగం చేసిన కుటుంబానికి చెక్కు బౌన్స్ ఘ‌ట‌న అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించ‌డ‌మే అవుతుందన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సుకుమా అమ‌ర‌వీరుల‌కు నివాళులు కూడా అర్పించ‌లేద‌ని బీహార్ సీఎం నితీశ్‌ పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ చెక్కు బౌన్స్ ఆయ‌న్ని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హంవ వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News