బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోదశ పోలింగ్ ఎన్డీయే కూటమిలో టెన్షన్ పెంచేస్తోంది. 17 జిల్లాల్లోని 94 సీట్లకు మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశ పోలింగ్ లో అత్యధిక సీట్లను గెలుచుకోలేకపోతే అధికారంపై ఎన్డీయే దాదాపు ఆశలు వదులుకోవాల్సిందే అని సర్వేలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిగిన పోలింగ్ 71 సీట్లలో ఆర్జీడీ నేతృత్వంలోని యూపీఏ కూటమికే అత్యధిక సీట్లు వస్తాయని సర్వేల ద్వారా స్పష్టమైంది. ఈ నేపధ్యంలోనే రెండోదశ పోలింగ్ అత్యంత కీలకమైపోయింది.
రెండో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లోనే ఆర్జేడీ చీఫ్, ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న రాఘవపూర్ నియోజకవర్గముంది. తేజస్వీతో పాటు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఏడుగురు అభ్యర్ధులు కూడా పోటి చేస్తున్నారు. రెండోదశ పోలింగ్ కు సంబంధించిన ఎన్డీయే కూటమి నిర్వహించిన ర్యాలీలు, ప్రచారంలో జేడీయూ అభ్యర్ధులకు చాల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని కారణంగా జేడీయూ అభ్యర్ధులకు వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు బయటపడటంతో ఎన్డీయే కూటమిలో టెన్షన్ పెరిగిపోతోంది.
ఇదే సమయంలో యూపీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న తేజస్వి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పోటి చేస్తున్న హసన్ పూర్ నియోజకవర్గంలో గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. హోలు మొత్తం మీద జేడీయూ అభ్యర్ధులకు వ్యతిరేక గాలులు వీస్తుండటమంటే పరోక్షంగా దాని ప్రభావం బీజేపీ మీద కూడా పడటం ఖాయమే. ఎందుకంటే రెండు మిత్రపక్షాలుగా బరిలోకి దిగాయి కాబట్టి. ఇదిలాగుంటే ఎల్జేపీ అభ్యర్ధులు కూడా ఎన్డీయే కూటమి అభ్యర్ధులను కంగారు పెట్టేస్తున్నారు.
నితీష్ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగా పాశ్వాన్ 243 నియోజకవర్గాల్లోను అభ్యర్ధులను రంగంలోకి దింపారు. బీజేపీ టికెట్లు నిరాకరించిన నేతలను చిరాగ్ తన పార్టీలోకి చేర్చుకుని వెంటనే టికెట్లు ఇచ్చి పోటీలోకి దింపేశారు. దాంతో వాళ్ళు ఇటు జేడీయు, అటు బీజేపీ అభ్యర్ధులకే పోటీగా తయారయ్యారు. ఒకవేళ ఎల్జేపీ అభ్యర్ధులుగా గెలవలేకపోయినా పై రెండు పార్టీల్లోని అభ్యర్ధుల ఓటమికి కారణమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బలమైన ప్రత్యర్దులుగా ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్ధులున్నారు కాబట్టి.
ఇటువంటి అనేక కారణాలతో ఎన్డీయే కూటమి ప్రధానంగా జేడీయూ అభ్యర్ధులు విజయానికి నానా అవస్తలు పడుతున్నారు. రెండోదశలో గనుక వెనుకబడిపోతే ఇక మూడోదశపై ఆశలు వదులుకోవాల్సిందే అనే సంకేతాలు కనబడుతున్నాయి. అంటే హోలు మొత్తం మీద బీహార్ పీఠాన్ని నితీష్ వదులుకోవాల్సిందే అనే విషయంలో క్లారిటి వచ్చేస్తోంది. మరి తన నరేంద్రమోడి ఛరిష్మా ఎలా పనిచేస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే 2015 ఎన్నికల్లో స్వయంగా నరేంద్రమోడి ఎంత ప్రచారం చేసినా బీహారు జనాలు బీజేపీకి ఓట్లేయలేదు. మరిపుడేమి చేస్తారనేది సస్పెన్సుగా మారిపోయింది.