చుట్టూ బంగారం ఉన్న గని... ఆకలితో 100 మంది బలి!

ఈ నేపధ్యంలోనే మరణించారని.. ఈ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ టీమ్ మీడియాతో చెప్పిందని అంటున్నారు.

Update: 2025-01-14 11:30 GMT

దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సుమారు 100 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇందులో భాగంగా.. బంగాru గనిలో చిక్కుకొని 100 మంది కార్మికులు మృతిచెందారు. దక్షిణాఫ్రికాలోని ఓ బంగారు గనిలో వీరంతా అక్రమంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

అవును... దక్షిణాఫ్రికాలోని ఓ బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతిచెందారు. ఈ సమయంలో.. ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని.. ఈ నేపధ్యంలోనే మరణించారని.. ఈ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ టీమ్ మీడియాతో చెప్పిందని అంటున్నారు.

ఈ ఘటనపై స్పందించిన మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో... గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో కొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయని.. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు గనిలోపల కనిపిస్తున్నాయని తెలిపారు!

ఈ సందర్భంగా స్పందించిన సంస్థ ప్రతినిధి.. వాయువ్య ప్రావిన్స్ లోని గనిలో 100 మంది వరకూ మృతిచెందారని.. ఇప్పటి వరకూ 18 మృతదేహాలను బయటకు తీశారని వెల్లడించారు. ఇదే సమయంలో.. వారు ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News