సెల్ ఫోన్ దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. ఇపుడు ఈ తరహా దొంగతనాలకు సినీతారలు కూడా బలవుతున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ ఫోన్ చోరికి గురయింది. చోరుల చేతుల్లో సెల్ ఫోన్ పోగొట్టుకున్న ఆ వివరాలు ఏంటంటే...ముంబైలోని సబర్బన్ మలద్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ కు బాలీవుడ్ నటి - మోడల్ అర్షిఖాన్ వెళ్లింది. షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన ఆమె బయటకు నడుస్తుండగా బైక్ పై వేగంగా వచ్చిన దుండగులు ఆమె ఫోన్ లాక్కుని పారిపోయారు.
చోరీకి గురైన సెల్ ఫోన్ ఖరీదు దాదాపు రూ.55000 ఉంటుందని అర్షి ఖాన్ మేనేజర్ రాజేశ్ సింగ్ తెలిపారు. దీంతో ఆమె బంగుర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫోన్ విలువ 55 వేల రూపాయలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అర్షిఖాన్ అంటే ఆ మధ్య పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో సంబంధం ఉందని తనకు తానుగా చెప్పిన నటీమణే. ఆఫ్రిదీతో సంబంధం ఉందని చెప్పడమే కాదు...తాను ఎవరితోనైనా గడపాలంటే ఇండియాలో పర్మిషన్ తీసుకోవాలా అంటూ హాట్ కామెంట్ కూడా చేసింది.