కాస్తంత విశాలంగా రహదారులు ఉండి.. ట్రాఫిక్ పల్చగా ఉండే మార్గాలు కనిపిస్తే చాలు.. బైక్ రేసర్లకు కాలు నిలవదు. దీనికి తోడు.. సంపన్నుల పిల్లలు కావటం.. తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు.. పలుకుబడి అన్నీ అక్కరకు రావటంతోపాటు.. తామేం చేసినా.. తమ తల్లిదండ్రులు చూసుకుంటారన్న బరి తెగింపు కాస్త ఎక్కువే.
దీంతో.. ఇంతకాలం.. అవుటర్ రింగ్ రోడ్డు.. నెక్లెస్ రోడ్డు లాంటి చోట్ల రేసింగ్ లు నిర్వహించే యూత్ బ్యాచ్.. పోలీసుల తనిఖీల కారణంగా ఇప్పుడు సరికొత్త అడ్డాల్ని వెతుక్కోంటోంది. తాజాగా వారు బంజారాహిల్స్.. జూబ్లీ హిల్స్ ప్రాంతాల మీద కన్నేశారు. తమ రేసింగ్ లకు కొత్త అడ్డాగా ఈ సంపన్న ప్రాంతాల్ని ఎంపిక చేసుకున్నారు.
తాజాగా శుక్రవారం రాత్రి బైక్ రేసింగ్ కోసం పోగైన డబ్బులున్నోళ్ల పిల్లలు బంజారాహిల్స్.. జూబ్లీ హిల్స్ లో పెద్ద ఎత్తున పోగయ్యారు. ఖరీదైన బైకులతో రయ్యి.. రయ్యి మంటూ దూసుకుపోయారు. దీనికి సంబంధించిన సమాచారన్ని అందుకున్న పోలీసులు స్పందించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 30 మందికి పైగా యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇప్పటి వరకూ ఇలాంటివెన్నో జరిగినా.. కేసులు.. వారికి శిక్షలు పడినట్లుగా కనిపించిన దాఖలాలు లేవన్న విమర్శ ఉంది. ఒకవేళ.. ఇలాంటి వారిపై కేసులు బుక్ చేసి.. వారికి శిక్షలు పడితే.. ఆ విషయాన్ని పోలసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే.. కొత్త నేరాలకు అడ్డుకట్ట పడే వీలుందన్న పోలీసులు ఆ కోణంలో ఆలోచించటం మంచిది.