అందాల పోటీల్లో బికినీల‌కు గుడ్ బై!

Update: 2018-06-07 04:35 GMT
అందాల పోటీ ఏదైనా స‌రే.. పోటీదారులు బికినీలు ధ‌రించి.. ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ విష‌యంలో చారిత్ర‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది అమెరికా. ఈ ఏడాది నిర్వ‌హించే మిస్ అమెరికా అందాల పోటీలో స్విమ్ సూట్ల‌తో ర్యాంప్ వాక్ చేసే వైనానికి గుడ్ బై చెప్ప‌నున్నారు. బికినీలతో అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ.. ర్యాంప్ మీద న‌డిచే కార్య‌క్ర‌మానికి చెల్లుచీటి ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని మిస్ అమెరికా నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.

మిస్ అమెరికా అందాల పోటీని 1921 నుంచి నిర్వ‌హిస్తున్నారు. బ్యూటీ కాంటెస్ట్ లో స్విమ్ సూట్ ధ‌రించి హోయ‌లు చిందిస్తూ ర్యాంప్ మీద న‌డ‌వ‌టం.. దాని ఆధారంగా అంతిమ విజేత‌ను ఎంపిక చేయ‌టం ఉంటుంది. ఆ సంప్ర‌దాయానికి చెల్లుచీటి ఇవ్వాల‌ని డిసైడ్ చేశారు. ఎందుకిలా అంటే.. మ‌హిళా సాధికార‌త‌.. స‌మాన‌త్వానికి ప్రాధాన్య‌త ఇస్తూ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌న్నారు.

రాబోయే అందాల పోటీల్లో పోటీదారులు త‌మ ఇష్టాయిష్టాలు.. సామాజిక అంశాల గురించి వివ‌రించే అంశాల ఆధారంగానే విజేత‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. మిస్ అమెరికా కాంటెస్ట్ ను నిర్వ‌హించే సంస్థ‌లో ఉన్న వారంతా మ‌హిళ‌లే కావ‌టం.. మోడ‌ళ్ల చేత స్విమ్ సూట్లు ధ‌రించే అంశంపై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపిన వారు.. అందాల పోటీల‌కు స్విమ్ సూట్ తో శ‌రీరాకృతిని ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న‌కు వ‌చ్చారు. దీంతో.. ఈ ఏడాది నుంచి నిర్వ‌హించే మిస్ అమెరికా బ్యూటీ కాంటెస్ట్ లో బికినీ రౌండ్‌ ను ఎత్తేయ‌నున్నారు. ఈ నిర్ణ‌యం చారిత్రాత్మ‌కంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. ఒంటిసొంపుల కంటే కూడా మెద‌డులో ఉన్న గుజ్జు ఆధారంగానే అంతిమ విజేత‌ను డిసైడ్ చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజా నిర్ణ‌యం బ్యూటీ కాంటెస్ట్ ల‌ను వ్య‌తిరేకించే వారు సైతం అభిమానించేలా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.


Tags:    

Similar News