ఏ ఎన్నికలు వచ్చినా... గాంధీ భవన్ లో కుర్చీలు విరగడం మాత్రం గ్యారంటీ. అయితే... పొత్తుల పుణ్యమా అని అది ఈసారి భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఇంకా సీట్లు తేల్చని కాంగ్రెస్ అధినేతలకు... తమ తడాఖా ఏంటో అభ్యర్థులు ఆల్రెడీ చూపిస్తున్నారు. నిన్న కూకట్ పల్లిలో - గాంధీ భవన్ లో జరిగిన రచ్చే ఈ శాంపిల్.
హైదరాబాదులో చాలా సీట్లు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అయితే, వైఎస్ హయాంలో నగరంలో కాంగ్రెస్ కూడా బలపడింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య తక్కువేమీ లేదు. ఇపుడు టీడీపీ హైదరాబాదులో తమ సీట్లకు పోటీ రావడంతో ఇప్పటికే కాంగ్రెస్ కు ఒక్కో నియోజకవర్గంలో టిక్కెట్ ఆశావహులు ఇద్దరు ముగ్గురు ఉంటే ... దానికి టీడీపీ ఇంకా పెద్ద పోటీ అయ్యింది. అందుకే గాంధీభవన్ రణరంగం అయ్యింది. ఎంతో కాలంగా ఖర్చుపెట్టుకుని వస్తున్న తమకు అన్యాయం చేసి పక్క పార్టీవోడికి టిక్కెట్ ఇస్తారా అంటూ శేరిలింగంపల్లి టిక్కెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో రచ్చరచ్చ చేశారు.
‘పొత్తులుండాలి.. సీటు మాత్రం మాకే దక్కాలి..’’ అన్నట్లు మహాకూటమి ఇతర పార్టీలు వ్యవహరిస్తుంటే... మాకవన్నీ తెల్వదు - టిక్కెటియ్యాల్సిందే... అని కాంగ్రెస్ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా పార్టీలన్నీ చర్చలు కొనసాగిస్తున్నా... ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత రాలేదు. కానీ కొందరు ఆర్థికంగా బలమైన అభ్యర్థులు తమకే టిక్కెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అయితే, నిన్నా మొన్నా శేరిలింగంపల్లి టిక్కెట్ మొవ్వకు ఇస్తారని ప్రచారం జరగడంతో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ గాంధీభవన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఆయన అనుచరులు ముగ్గురు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇటువంటి పరిస్థితే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ ఎదురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో టిక్కెట్లు ప్రకటించడానికి కాంగ్రెస్ అధినేతలకు వెన్నులో వణుకొస్తుంది. పొగిడిన నేతలే బండబూతులు తిడతారేమో అని భయం.