ప‌్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్ఛభారత్ - నోట్ల రద్దులాంటి నిర్ణయాలను మెచ్చుకున్నారు. తన గేట్స్‌నోట్స్.కామ్ బ్లాగ్‌లో గేట్స్ మోడీపై అభినందనల జల్లు కురిపించారు. మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు.
``మూడేళ్ల కిందట భారత ప్రధాని నరేంద్ర మోడీ పబ్లిగ్గా కొన్ని సాహసోపేతమైన ప్రసంగాలు చేశారు. ప్రధానిగా ఎన్నికైన నేత ఇలా మాట్లాడటం నేను చూడలేదు. స్వచ్ఛభారత్ కోసం అప్పుడే నడుం బిగించారు. తన మాటలను చేతల్లోనూ చూపించిన ఘనత ఆయన సొంతం. 2019కల్లా భారత్ లో బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇందులో భాగంగా 7.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు`` అని బిల్ గేట్స్ తన బ్లాగ్ లో రాసుకున్నారు.
కాగా, గతేడాది భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా గేట్స్ ప్రశంసించిన విషయం తెలిసిందే. షాడో ఎకానమీకి చెక్ పెట్టడానికి పాత నోట్లను రద్దు చేసి ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న కొత్త నోట్లు ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని గేట్స్ అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన అన్ని చర్యలను భారత్ ఇప్పటికే చేపట్టిందని ఆయన కొనియాడారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/