ప్రపంచ కుబేరుల జాబితా మరోసారి విడుదలైంది. వరుసగా మూడో ఏడాది ప్రపంచ కుబేరుల్లోటాప్ పొజిషన్ ను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నిలుపుకున్నారు. గడిచిన 22 సంవత్సరాల్లో 17 సార్లు అగ్రస్థానంలో గేట్స్ నిలవటం గమనార్హం. తాజాగా ఆయన ఆస్తుల విలువ మన రూపాయిల్లో లెక్క కడితే రూ.5.10లక్షల కోట్లుగా లెక్క తేలింది. గేట్స్ తర్వాత రెండో స్థానం స్పెయిన్ కు చెందిన రిటైల్ సంస్థ జెరా వ్యవస్థాపకుడు అమాన్ షియో అర్డెగా నిలవగా.. మూడో స్థానంలో బెర్క్ షైర్ హాత్ వే సీఈవో వారెన్ బఫెట్ నిలిచారు. ఇక.. గత ఏడాది 16వ స్థానంలో ఉన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్.. ఈ ఏడాది ఆరో స్థానానికి ఎగబాకటం గమనార్హం.
ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో ప్రపంచ కుబేరులకు సంబందించి 1810 మందికి స్థానం దక్కగా.. అందులో 84 మంది భారతీయులకు స్థానం లభించటం విశేషం. ఇక.. భారతీయ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో 36వ స్థానాన్ని సంపాదించారు. ఆయన సంపద రూ.1.40లక్షల కోట్లుగా తేల్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందన ధరలు తగ్గటంతో రిలయన్స్ షేరు తగ్గినప్పటికీ.. ఆయన ర్యాంకు మాత్రం చెక్కు చెదర్లేదు.
ప్రపంచ కుబేరుల్లో వెయ్యి లోపు ర్యాంకులో నిలిచిన భారత కుబేరుల్ని చూస్తే..
ముఖేశ్ అంబానీ (36వ స్థానం)
అజీజ్ ప్రేమ్ జీ (55వ స్థానం)
శివనాడార్ (88వ స్థానం)
లక్ష్మీ మిత్తల్ (135వ స్థానం)
సునీల్ మిత్తల్ (219వ స్థానం)
గౌతమ్ అదానీ (453వ స్థానం)
సావిత్రి జిందాల్ (453వ స్థానం)
రాహుల్ బజాజ్ (722వ స్థానం)
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (959వ స్థానం)