కరోనా అంతంపై బిల్ గేట్స్ సంచలన విషయాలు

Update: 2020-04-24 16:30 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు ప్రపంచంలోనే టాప్ కుబేరుల్లో ఒకరు - మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్. ఈ కరోనా వైరస్ ను అంతం చేయాలంటే ఏం చేయాలనే దానిపై బిల్ గేట్స్ ఓ ప్రణాళికలను సూచిస్తున్నారు. ఈ మేరకు తన బ్లాగ్ లో అభిప్రాయాలు వెల్లడించారు.

కరోనా వైరస్ పై సృజనాత్మకతను ఓ ఆయుధంలా ప్రయోగించాలని బిల్ గేట్స్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రాడార్ ను కనిపెట్టడంతో టార్పడోలు - కోడ్ బ్రేకింగ్ వంటివి యుద్ధాన్ని ముగించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం విశ్వాన్ని కబలిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ఇదే జరగాలని బిల్ గేట్స్ సలహా ఇచ్చారు.

సృజనాత్మకతను ఐదు రకాలుగా బిల్ గేట్స్ అభివర్ణించారు. చికిత్సలు - టీకాలు - పరీక్షలు, -వైరస్ కు గురైన వారిని వెతకడం.. నిబంధనలు ఉపసంహరణకు విధానాలు. ఈ అన్నింటిని సృజనాత్మకత సాధించకుండా సాధారణ జీవితానికి మళ్లలేం అని.. వైరస్ను నియంత్రించలేమని గేట్స్ అభిప్రాయపడ్డారు.

"ఇదో ప్రపంచ యుద్ధం లాంటిది, ఈ సందర్భంలో తప్ప, మనమంతా ఒకే వైపు ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి దానితో పోరాడటానికి సాధనాలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయగలరు. నష్టాన్ని పరిమితం చేయడంలో గ్లోబల్ ఇన్నోవేషన్‌ను నేను చూస్తాను.’’ అంటూ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.

కరోనాకు టీకా కనిపెట్టడం ముఖ్యమని.. కానీ టీకా తయారీకి రెండు నుంచి ఐదేళ్లు పడుతుందని.. కరోనాకు 18 నెలల్లో రావచ్చని బిల్ గేట్స్ తెలిపారు.

ఇక వ్యాపారాలు పున: ప్రారంభించడం.. బహిరంగ ప్రదేశాల్లోకి జనాన్ని అనుమతించడానికి అబివృద్ధి చెందిన దేశాలు తొందరపడుతున్నాయని.. ఇలా చేస్తే రెండు నెలల్లోనే కరోనా తీవ్ర దశకు చేరుతుందని బిల్ గేట్స్ హెచ్చరించారు. ఎంత వరకు అనుమతించాలి? ఎంత ఇన్ ఫెక్షన్ వ్యాపిస్తుంది? బట్టి ప్రభుత్వాలు ఆలోచించాలని బిల్ గేట్స్ సూచించారు.

ఆర్థిక వ్యవస్థకు లేదా మానవ సంక్షేమానికి పెద్ద ప్రయోజనం కలిగించే కార్యకలాపాలను అనుమతించడం మేలని.. అయితే కరోనా సంక్రమణకు దీంతో ప్రమాదం పొంచి ఉందని.. జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలకు బిల్ గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ సూచనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
Tags:    

Similar News