ఆఫ్ఘన్ లో తాలిబాన్లు ఆధిపత్యాన్ని సాధించడంతో ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రపంచదేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఇటీవల ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ ను ప్రమాదంలో పడేసింది. 20 ఏళ్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా సైన్యాన్ని ఇటీవల ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇలా ఉపసంహరించుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లు మళ్లీ రెచ్చిపోయే ప్రమాదం ఉంది అని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ జో బైడెన్ మాత్రం వినిపించుకోలేదు. అమెరికా అలా వెనక్కి తగ్గగానే తాలిబన్లు మళ్లీ తమ పని కానిచ్చేశారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పదేళ్ల క్రితమే చెప్పాడా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి సేనలను ఉపసంహరించుకున్న తర్వాత బైడెన్ విషయంలో లాడెన్ చెప్పింది నిజం కాబోతోందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2011లో అమెరికా బలగాలు లాడెన్ ను మట్టుబెట్టిన తర్వాత అతడు రాసిన 48 పేజీల లేఖ లభ్యమైంది.
మే 2010లో తన సోదరుడు అతియా అబ్దుల్ రహ్మాన్ కు లాడెన్ ఈ లేఖ రాశాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్‌ల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో సూచించిన లాడెన్, బైడెన్ జోలికి వెళ్లొద్దని మాత్రం హెచ్చరించాడు. ఒబామాను చంపేస్తే బైడెన్ అధ్యక్షుడవుతాడని, ఆయన అధ్యక్షుడయ్యాడంటే మన కల నెరవేరినట్టేనని పేర్కొన్నాడు. అధ్యక్ష పదవికి బైడెన్ పూర్తిగా అసమర్థుడని, ఆయన హయాంలో అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని, అతడితోనే అమెరికా పతనం ప్రారంభమవుతుందని ఆ లేఖలో లాడెన్ పేర్కొన్నాడు.
కాబట్టి బైడెన్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దని 48 పేజీలున్న ఈ లేఖలో తన అనుచరులకు సూచించాడు. ఆ లేఖలోని 36వ పేజీలో రెండు హిట్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలన్న తన కోరికను లాడెన్ వెల్లడించాడు. అందులో ఒకటి పాకిస్థాన్ లో, మరోటి ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటు చేయాలన్నాడు. ఈ రెండూ ఒబామా, సీఐఏ డైరెక్టర్‌ల హత్యకు పథక రచన చేయాలని కోరాడు. 2012లో తొలిసారి ఈ లేఖ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మరోమారు వెలుగులోకి వచ్చింది.