ట్రంప్ గెలవకపోతే మరో 9/11లాంటి దాడి .. బిన్ లాడెన్ మేనకోడలు కీలక వ్యాఖ్యలు !
అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య పోరు హోరా హోరీగా ఉండబోతుంది అని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, కొన్ని సర్వేల ప్రకారం ట్రంప్ కంటే జో బైడెన్ ముందున్నారు. అయితే , మరోసారి అధ్యక్ష పీఠం నాదే అని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా ముందుకుసాగుతుంది. ఇలాంటి తరుణంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ మేనకోడలు నూర్ బిన్ లాడెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలవకపోతే, అమెరికాకు ప్రమాదమని ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. బిడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐ ఎస్ బాగా విస్తరించిందని ఆమె ఆరోపణలు చేసింది. ట్రంప్ హయాంలో విదేశీ విపత్తులు, ఉగ్రవాదులను అగ్రరాజ్యం గట్టిగా ఎదుక్కొందని నూర్ పేర్కొంది. ఉగ్రవాదులను మూలాల్లోకి వెళ్లి మరీ ట్రంప్ సర్కారు హతమార్చిందని ఆమె చెప్పింది. ఇలా కాటు వేయక ముందే పాము తల పగలగొట్టారని ట్రంప్ ను మెచ్చుకుంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గనుక ట్రంప్ ఓడిపోయి, మళ్లీ బిడెన్ అధ్యక్షుడైతే ప్రమాదమని హెచ్చరించింది. బిడెన్ గనుక ఎన్నికల్లో గెలిస్తే.. 9/11లో అమెరికాపై జరిగిన ఉగ్రదాడి వంటి దాడులు మరోసారి జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.