కొత్త కరోనాకి వ్యాక్సిన్ .... 6 వారాల్లోనే సిద్ధంచేస్తామన్నా బయోఎన్ టెక్ !
కరోనా మహమ్మారి నుండి ఇంకా పూర్తిగా కోలుకమునుపే బ్రిటన్ కేంద్రంగా వెలుగుచూసిన స్ట్రెయిన్ వైరస్ ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తుంది. ఈ కొత్త వైరస్ దెబ్బకి ఇప్పుడు మళ్లీ చాలా దేశాలు లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. బ్రిటన్ లో ఇప్పటికే లాక్ డౌన్ అమల్లోకి రాగా , బ్రిటన్ నుండి వచ్చే విమానాలను చాలా దేశాలు కొన్ని రోజుల పాటు నిషేధించాయి. భారత్ కూడా అప్రమత్తమై ఆయా దేశాల విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయించింది. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఐసోలేషన్ ఏర్పాట్లకు సమాయాత్తం చేసింది.
ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోఎన్ టెక్ కొత్త రకం వైరస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫైజర్ తో కలసి తాము రూపొందించిన టీకా కొత్త కరోనాకూ చెక్ పెట్టగలదని చెప్తూనే .. అవసరమైతే కొత్త వైరస్ కోసం ప్రత్యేక టీకాను కూడా డిజైన్ చేయగలమని, అది కూడా కేవలం ఆరు వారాల్లోనే ఈ నయా స్ట్రెయిన్ కు చెక్ పెట్టేలా టీకాను అందుబాటులోకి తీసుకురాగలమని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓ మీడియాతో పేర్కొన్నారు. ఆరు వారాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు బయోఎన్‌టెక్ టీకాను అందుబాటులోకి తీసుకురాగలదు అని స్పష్టం చేశారు.
ప్రస్తుత కరోనా మహమ్మారికి అతి త్వరలో వ్యాక్సిన్ రాబోతుంది అన్న ఆనందంలో ఉన్న సమయంలో బ్రిటన్ ఒక్కసారిగా కొత్త వైరస్ అంటూ ప్రకంపనలు సృష్టించింది. ఇది ఏ విధంగా ముందుకుపోతుందో అర్థంకాక ప్రపంచ దేశాలన్నీ బిక్కు బిక్కుమంటున్నాయి.