జ్వరం దగ్గుకు ఒక డాక్టర్.. చెవి ముక్కు కంటి చికిత్సకు ఒక డాక్టర్.. గుండె రోగానికి ఒక డాక్టర్ ఉన్నట్టే సెక్స్ సమస్యల పరిష్కారానికి నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. డేరా బాబాలు కొందరు సెక్సాలజీ నిపుణులం అంటూ వాల్ పోస్టర్లు అంటించి మరీ పబ్లిసిటీ చేసుకుంటారు.
అయితే ఇంతవరకూ ఎవరూ ఈ తరహా కాన్సెప్ట్ పై దృష్టి సారించినట్టు లేదు. బాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఇప్పుడు దీనిపై దృష్టి సారించారు. అతడు సెక్సాలజీపై ఓటీటీ సిరీస్ ని రూపందిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నిజాయితీపరుడైన సెక్సాలజిస్టులు గొప్ప సంఘ సేవికులు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.
బాలీవుడ్ దర్శకనిర్మాత ఇంతియాజ్ అలీ సెక్సాలజీ వృత్తిపై అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేయడమే కాదు..సెక్స్ సమస్యల పరిష్కారంలో వైద్యులు గొప్ప సేవ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 'డాక్టర్ అరోరా-గుప్త్ రోగ్ విశేషజ్ఞ' పేరుతో డాక్టర్ల వృత్తికి సంబంధించిన నైతిక ప్రవర్తనా నియమావళిపై ధారావాహికను రూపొందించిన అతడు..తన రోగులతో అత్యంత నిజాయితీతో వ్యవహరించే సెక్సాలజిస్ట్ కథను ఆవిష్కరించారు. ఈ ధారావాహికలో ప్రధాన పాత్రను కుముద్ మిశ్రా పోషించారు.
లైంగిక సమస్యలు బయటికి చెప్పుకునేవి కావు. అందువల్ల అలాంటి షాడో సమస్యల పరిష్కారానికి పని చేయడం వల్ల సమాజానికి వైద్యులు గొప్ప సేవ చేస్తున్నారు. వారు పేషెంట్ గోప్యతను తమ బాధ్యతగా భావించడం గొప్ప విషయం! అని ఇంతియాజ్ అన్నారు. మనకు ఫ్రాక్చర్ పడితే ఆర్థోపెడిక్ వద్దకు వెళతాం. కానీ లైంగిక రుగ్మతలు లేదా వ్యాధుల విషయానికి వస్తే ఏదీ బయటికి చెప్పుకోలేం.. దానిని దాచి ఉంచాలి! అని అన్నారు.అందుకే సెక్సాలజిస్టులు గొప్పవారు అని కూడా ఆయన ప్రశంసించారు.
తమాషా-రాక్ స్టార్ లేదా జబ్ వి మెట్ వంటి ఆఫ్ బీట్ సినిమాలతో ఆకట్టుకున్న ఇంతియాజ్ అలీ సెక్సాలజిస్టుపై సిరీస్ చేయాలన్న ఆలోచన రావడానికి కారణమేమిటీ? అని ప్రశ్నిస్తే ఆసక్తికర సంగతిని తెలిపారు. ''నేను కాలేజీ డేస్ లో సెలవుల్లో జంషెడ్ పూర్ నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లేవాడిని., నేను ఢిల్లీకి తిరిగి వెళ్ళే రైలులో విండో సీటు దగ్గరలో సెక్సాలజిస్టుల ప్రకటనలు చూసినట్లు నాకు గుర్తుంది. ఒక పట్టణంలో మనుషులు లైంగికత సత్యం దాని గోడలపై రాసి ఉంటుంది.
ఈ వ్యక్తులు నగరాల శివార్లలో ఎక్కువగా ఎందుకు ప్రచారం చేసుకుంటారు? ఎల్లప్పుడూ ఆ గోడలలో ఒకదానిపై ఎందుకు కనిపిస్తారు? అనేది నాకు ఆసక్తిని కలిగించింది. రైలు పట్టాలపైనా ఈ ప్రచారం వారి ప్రపంచాన్ని అన్వేషించడానికి వారి కథను చెప్పడానికి నన్ను ప్రేరేపించింది... అని ఇంతియాజ్ అలీ వెల్లడించారు. ఇంతియాజ్ ఒకవేళ తన సిరీస్ లో డా.జి.సమరం రియల్ స్టోరీని కూడా చెప్పారేమో చూడాలి.