కరోనాకు వ్యాక్సిన్ తయారీలో భారత్ అమెరికా, రష్యా, చైనా దేశాలతో పోటీ పడుతోంది. బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పలు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. కాగా తాజాగా బయోటెక్ ప్రభుత్వం నుంచి కొత్తగా కొన్ని అనుమతులు తీసుకుంది. మాములుగా ఏ టీకా అయినా భుజానికి, పిరుదులకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని నోటి ద్వారా, సెలైన్, నరాల ద్వారా ఇస్తుంటారు. చర్మపు కింది పొరలకు ఇచ్చే టీకాలు కూడా ఉన్నాయి. కరోనాకు సిద్ధం అవుతున్న కొవాగ్జిన్ టీకాను కూడా చర్మపు కింది పొరకు ఇవ్వనున్నారు. ఇందుకు బయోటెక్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. మన దేశ జనాభా సుమారు 130 కోట్లు. ఇందులో 25 శాతం మంది కరోనా బారిన పడ్డారు. వీరందరికీ టీకా సిద్ధం చేయాల్సి ఉంది. టీకాలు అధికంగా భుజానికి వేస్తుంటారు. దీనికి ఎక్కువ డోసు అవసరం అవుతుంది. దీని తయారీకి ఖర్చు కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. దేశ జనాభాలో 25 శాతం మంది వ్యాధి బారిన పడడం వల్ల ఇంతమందికి టీకా సిద్ధం చేయడం అసాధ్యమైన పని. అందుకే శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. టీకాను భుజానికి కాకుండా చర్మపు కింది పొరకు వేస్తే తక్కువ డోసులోనే టీకాను అందించవచ్చని వారి అభిప్రాయం. తద్వారా లక్షలసంఖ్యలో టీకాలు సిద్ధం చేయడమే కాక చవకైన ధరలోనే ప్రజలకు అందించడానికి వీలవుతుందని బయోటెక్ ప్రతిపాదిస్తోంది. దేశ ప్రజల్లో పేదల శాతం అధికంగా ఉండటం, కరోనా పరిస్థితులతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకు పోయి ఉండటంతో వారిని టీకా పేరుతో మరింత ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు.అందుకే బయోటెక్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
కొత్త విధానం ద్వారా దేశ ప్రజలందరికీ సరిపడా టీకా తక్కువ కాలంలోనే సిద్ధం చేయవచ్చని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 125 ఆసుపత్రుల్లో 1125 మందిపై కొవాగ్జిన్ టీకాతో మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూడో దశ ట్రయల్స్ కూడా ప్రారంభించనున్నారు.
కొత్త విధానం ద్వారా దేశ ప్రజలందరికీ సరిపడా టీకా తక్కువ కాలంలోనే సిద్ధం చేయవచ్చని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 125 ఆసుపత్రుల్లో 1125 మందిపై కొవాగ్జిన్ టీకాతో మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూడో దశ ట్రయల్స్ కూడా ప్రారంభించనున్నారు.