భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక భౌతిక కాయాలకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇద్దరు కుమార్తెలు కృతిక, తారిణి కలిసి వారికి అంత్యక్రియలు నిర్వహించారు.
జీవిత ప్రయాణాలాగనే రావత్ దంపతులు చివరి ప్రయాణం కూడా చితిపైనే సాగడం గమనార్హం. ఆయనతో కలిసి ఏడడుగులు నడిచిన సతీమణి ఆయన తోడుగానే వెళ్లిపోవడం విషాదం నింపింది.
సీడీఎస్ బిపిన్ రావత్ కు భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. యావత్ ప్రజానీకం రావత్ కు నివాళులర్పించింది. మీ త్యాగం మరువలేనిదంటూ రావత్ సేవలను దేశం మొత్తం స్మరించుకుంది.
ఢిల్లీ కంటోన్మెంట్ లోని బ్రార్ స్క్రేర్ స్మశాన వాటికలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అంత్యక్రియలు ముగిశాయి. కూతుళ్లు కృతిక, తరుణి చితికి నిప్పటించారు. సైనిక లాంఛనాలతో జనరల్ రావత్ దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోపాటు పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. 800 మంది సైనికుల ఆధ్వర్యంలో అంత్యక్రియలను నిర్వహించారు. జనరల్ రావత్ నివాసం నుంచి బ్రార్ స్క్వేర్ స్మశాన వాటిక వరకూ అంతిమయాత్ర సాగింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బిపిన్ రావత్ 1958లో పౌరిలోని రాజపుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. ఈయన కుటుంబం దశాబ్దాలుగా ఆర్మీగా సేవలు చేస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెప్టినెంట్ జనరల్ గాపదవీ విరమణ పొందారు. అలాగే ఆయన తల్లి ఉత్తర కాశీ మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ పర్మార్ కూతురు. రావత్ డెహ్రడూన్ లోని కేంబ్రియన్ హాల్ స్కూల్ లో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. ఆ తరువాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. అక్కడ డిఫెన్స్ స్టడీస్ లో ఎంఫిల్ డిగ్రీ చేసి ఆ తరువాత మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టడీస్లో డిప్లొమా పొందారు.
1978లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ తన తండ్రి పనిచేసిన 5వ బెటాలియన్లోనే సేవలు అందించారు. 42 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేసిన బిపిన్.. బిగ్రేడ్ కమాండర్ గా.. జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీపఫ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, సీనియర్ ఇన్ స్ట్రక్టర్, ఆర్మీ స్టాప్ కు వైస్ చీఫ్ గా పనిచేశారు. త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా వీరి ముగ్గురిని సమన్వయం చేసేలా మరో అధికారిని నియమించాలని 1980లో జనరల్ కేవీ కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చాలా మంది సైనికులు, సీనియర్ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో మొట్టమొదటి త్రివిధ దళాదిపతిగా బిపిన్ రావత్ నియామకమ్యారు.
తమిళనాడులోని ట్రైనీ కాలేజీలో ప్రసంగించడానికి వెళుతూ హెలిక్యాప్టర్ కూలిన ప్రమాదంలో చనిపోయారు.