పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కూడా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని.. సైన్యం దేనికైనా రెడీగా ఉందని భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ ప్రకటించారు. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుతం చాలాకాలంగా కొనసాగుతున్న అల్లర్లకు పాకిస్థానే కారణమని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, కశ్మీర్ యువతను పాక్ రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు.
కాశ్మీర్ లోని పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆయన అన్నారు. రెండున్నర యుద్ధాలను ఎదుర్కోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని అంటూ పరోక్షంగా పాక్ - చైనాలతో పరిస్థితులు - కాశ్మీర్ అంశం గురించి మాట్లాడారు. సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడుతున్న ముష్కరులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
మరోవైపు కాశ్మీర్ లోని నౌగామ్ సెక‍్టార్ లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గురువారం భారత ఆర్మీ తిప్పికొట్టింది. చొరబాటుదారులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ప్రకటన సైన్యంలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/