ప్రకృతిలో జీవించే హక్కు మనకు ఎలా ఉందో అలాగే మిగతా అన్ని జీవరాశులకు ఉంది. అందరి కంటే మేధో సంపత్తిలో మేటి అయిన మనిషి భూమినే కాకుండా అంతరిక్షాన్ని సైతం ఏలుతున్నాడు. ఈక్రమంలోనే కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా మనిషి తనతోపాటు తోటి జీవరాశికి కూడా హాని కలిగిస్తుండటం శోచనీయంగా మారుతోంది.
రోజురోజుకు పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆహారం పండించడం అనేది కత్తి మీద సాములా మారుతోంది. 1974లో 400 కోట్ల జనాభా ఉండగా 2022 జనవరి 15 నాటికి ఆ సంఖ్య 800 కోట్లకు చేరింది. కేవలం 48 ఏళ్ళ కాలంలోనే జనాభా రెట్టింపు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆహారం యొక్క ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది.
రైతన్న పండించిన ఆహారాన్ని నిల్వ చేయడం ఒక ఎత్తయితే దానికి పక్షులు.. క్రిమికీటకాల నుంచి కాపాడుకోవడం సాహసంగా మారుతోంది. మనదేశంలో పండించిన ధాన్యాన్ని ఎలుకలు.. కోతులు.. కొండ ముచ్చులు.. అడవి పందుల నుంచి కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది. అలాగే కొన్ని దేశాల్లో మిడతల సమస్య చాలా తీవ్రంగా ఉంది.
ఈ మిడతలు ఒకేసారి లక్షలాదిగా పంటలపై దాడి చేసి రైతులను.. ప్రభుత్వాలను కోలుకోలేని దెబ్బతిస్తున్నాయి. ఈ మిడతల దాడిని అరికట్టేందుకు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు ఏకంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇటీవల మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మిడతల దాడిని అరికట్టేందుకు అధికారులను సరిహద్దుల్లోని మోహరించిన ఘటనలు ఉన్నాయి.
కెన్యా దేశం సైతం ప్రస్తుతం ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని పక్షుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం కొరత ఏర్పడుతోంది. ఎర్రటి ముక్కుతో చిన్నగా కన్పించే క్యులియా అనే పక్షి ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. ప్రభుత్వానికి రైతన్నలకు నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో కెన్యా ప్రభుత్వం ఏకంగా పక్షులపై యుద్ధానికి సిద్ధమైంది.
ఏకంగా 60 లక్షల పక్షులను చంపాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. క్యులియా పక్షుల వల్ల యేటా రెండువేల ఎకరాల్లో ధాన్యం.. గోధమ.. బార్లీ.. సన్ ప్లవర్ పంటలు నాశనం అవుతున్నాయిట. దీని ఫలితంగా 50 మిలియన్ డాలర్ల నష్టం వస్తోందని సమాచారం.
ఈ పక్షుల దెబ్బకు ఒకప్పుడు కరువుతో అల్లాడిన కెన్యా మరోసారి ఆ పరిస్థితికి చేరుకుంటుందని ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కెన్యాలో కరువు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా లక్షలాది పక్షులకు స్పాట్ పెట్టేందుకు రెడీ అయింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఎలాంటి అనర్ధాలు వస్తాయోనని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.