ఇదేం ఆఫర్ అంటారా? ఇక్కడే ఉంది అసలు విషయం. టమోటా అన్నంతనే కేజీ ఐదుకో.. పదికో వచ్చే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఈ మధ్యన అంతకంతకూ పెరుగుతూ పోతున్న టమోటాల ధర తాజాగా కొండెక్కి కూర్చుంది. దీనికి తోడు.. భారీ వర్షాల కారణంగా పంట పోవటం.. పంట పొలంలో ఉన్నా.. పాడు వాన కారణంగా దెబ్బ తిన్న దుస్థితి. ఇలాంటివేళ.. టమోటాలకు మార్కెట్లో భారీ డిమాండ్ చోటు చేసుకుంది.
మొన్నటి వరకు కేజీ టమోటా రూ.50-60 మధ్యన ఉన్న దానికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా సెంచరీ కొట్టేసింది. కొన్ని ఆన్ లైన్ సంస్థల్లో కేజీ టమోటా రూ.60-70 మధ్య నడుస్తున్నా.. వాటి నాణ్యత విషయంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇక.. బహిరంగ మార్కెట్లో టమోటాల ధర ఠారెత్తుతోంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో రూ.100ను టచ్ చేసిన టమోటా.. ఇప్పుడు తమిళనాడులో ఏకంగా రూ.150కు చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత రేటు పెరగటం ఖాయమంటున్నారు. టమోటాకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో తమిళనాడులోని ఒక హోటల్ వినూత్నంగా ఆలోచించింది. వినియోగదారులు తన హోటల్ ను వెతికి పట్టుకొని వచ్చేందుకు వీలుగా ఒక ఆఫర్ ను ప్రకటించింది.
కేజీ టమోటాల్ని తీసుకెళితే చాలు..ఒక బిర్యానీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు.. రెండు బిర్యానీలు కొనుగోలుచేసిన వారికి అరకేజీ టమోటాలు ఉచితంగా ఇస్తామని చెప్పి ఊరిస్తోంది. ఇంతకీ ఈ తరహా ఆఫర్ పెట్టిన హోటల్ ఎక్కడంటే.. చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాపు యజమాని ఈ తరహా ఆఫర్ ను ప్రకటించాడు. ఇతగాడి దగ్గర బిర్యానీ కేజీ రూ.100లకు అమ్ముతుంటాడు. టమోటాల ధరలు భారీగాపెరిగిన నేపథ్యంలో ఈ తరహా ఆఫర్ పెట్టి అందరిని ఆకర్షిస్తున్నాడు.
ఇతగాడిని స్పూర్తిగా తీసుకొని మరికొందరు సైతం టమోటాలతో బిర్యానీలను అమ్ముతూ లాభ పడుతున్నారు. తమిళనాడులోని వాణింబాడిలో రెండు బిర్యానీలు కొనుగోలు చేస్తే అరకేజీ టమోటాలు ఉచితంగా ఇస్తున్నారు. దీంతో.. బిర్యానీతో పాటు.. ఖరీదైన టమోటాలు కూడా చేతికి రావటంతో.. ఈ ఆఫర్ కు జనాలు ఇట్టే కనెక్టు అయిపోతున్నారట. టైమ్లీగా ఆఫర్లు ప్రకటించటమంటే ఇదేనేమో?