సీఎం స‌మావేశం..హోంమంత్రికి నో ఎంట్రీ..ఎందుకో?

Update: 2020-04-01 15:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాసం - అధికారిక కార్యాల‌యం అయిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద రాష్ట్ర హోం మంత్రి మెహమూద్ అలీకి ప‌రాభ‌వం ఎదురైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు - లాక్‌ డౌన్‌ అమలు - ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ - డీజీపీ మహేందర్‌ రెడ్డితో  వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి - ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజ‌ర‌య్యేందుకు హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ విచ్చేయ‌గా ఆయ‌న‌కు లోప‌లికి అనుమ‌తి నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం.

స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు మ‌హ‌మూద్ అలీ విచ్చేయ‌గా...లోపలికి అనుమతి లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెప్పడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయారని పలు మీడియా సంస్థ‌ల్లో ప్ర‌చారం జ‌రిగింది. పోలీస్ బాస్ అయిన‌ డీజీపీ మహేందర్ రెడ్డికి అనుమతి ఉండటంతో సమావేశానికి అనుమతించారని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న క్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి - అధికారులతో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి - పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.



Tags:    

Similar News