కరోనాతో వచ్చిపడిన సెకండ్ వేవ్ వల్ల దేశం అల్లకల్లోలంగా ఉంది. కోవిడ్ -19 వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టేశాయి. కరోనాతో పోరాడటానికి దేశం మొత్తం కష్టపడుతుండగా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పార్టీల్లో కనీసం నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతూ, కరోనా వ్యాప్తి చేస్తున్నారు.
తాజాగా కోవిడ్ -19 ఆంక్షల మధ్య మధ్యప్రదేశ్‌లో భింద్ జిల్లాలోని సుకుల్‌పురాలో పుట్టినరోజు వేడుకలకు ముసుగులు లేకుండా వందలాది మంది వేడుక చేసుకోవడం దుమారం రేపింది. ఇంటర్నెట్‌లో వచ్చిన వీడియో అందరికీ వణుకు పుట్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో గుమిగూడిన పెద్ద సమూహానికి మాస్కులు లేనే లేవు, పైగా వారు తమ తుపాకులను పట్టుకొని పార్టీలో హల్ చల్ చేశారు. వీరంగం సృష్టించారు. తుపాకులతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
స్థానిక రాజకీయ నాయకుడు రాజేష్ బాగెల్ తన కొడుకు బర్త్ డే కోసం నిర్వహిస్తున్నారని, అతనిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.Full View
తాజాగా కోవిడ్ -19 ఆంక్షల మధ్య మధ్యప్రదేశ్‌లో భింద్ జిల్లాలోని సుకుల్‌పురాలో పుట్టినరోజు వేడుకలకు ముసుగులు లేకుండా వందలాది మంది వేడుక చేసుకోవడం దుమారం రేపింది. ఇంటర్నెట్‌లో వచ్చిన వీడియో అందరికీ వణుకు పుట్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో గుమిగూడిన పెద్ద సమూహానికి మాస్కులు లేనే లేవు, పైగా వారు తమ తుపాకులను పట్టుకొని పార్టీలో హల్ చల్ చేశారు. వీరంగం సృష్టించారు. తుపాకులతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
స్థానిక రాజకీయ నాయకుడు రాజేష్ బాగెల్ తన కొడుకు బర్త్ డే కోసం నిర్వహిస్తున్నారని, అతనిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.