రూ.2 కోట్ల పెయింటింగ్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలు

Update: 2020-03-09 16:30 GMT
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ బ్యాంక్ సంక్షోభంపై చర్చ సాగుతోంది. పీకల్లోతు కష్టాల్లో పడిన ఎస్ బ్యాంక్ ను కాపాడడానికి ఒకవైపు అన్ని ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు ఎస్ బ్యాంక్ అక్రమాలు, అవినీతిపై ఈడీ తనిఖీలు ముమ్మరం చేసింది. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసాల్లో తనిఖీలు చేసింది. అయితే తాజాగా జరిగిన తనిఖీల్లో ఒక ఆశ్చర్య కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.2 కోట్ల విలువైన పెయింటింగ్ లభించింది. దీంతో ఈడీ, ఐటీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ పెయింటింగ్ తో సోనియా గాంధీ కుటుంబానికి సంబంధం ఉందని తేలడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దేశంలో ఏ కుంభకోణం, అక్రమాలు జరిగినా గాంధీ కుటుంబానికి లింక్ ఉంటోందని బీజేపీ ఎద్దేవా చేసింది. వాస్తవంగా ఏం జరిగిందింటే..

ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కు చెందిన విలువైన పెయింటింగ్ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వద్ద ఉంది. అయితే ఆయన మరణించినా ఆ పెయింటింగ్ భద్రంగా ఉంది. అయితే ఆయన మనవరాలు ప్రియాంక గాంధీ వద్ద ఉన్న ఆ పెయింటింగ్ చూసిన ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ ఆ పెయింటింగ్ ను ప్రియాంక వద్ద నుంచి కొనుగోలు చేశాడు. ఆ పెయింటింగ్ కు ఏకంగా రూ.2 కోట్లు చెల్లించి 2010లో కొనుగోలు చేశాడు. ఆ చెక్కును ఇచ్చిన విషయాన్ని బీజేపీ బయటపెట్టింది. దీంతో బీజేపీ ఎస్ బ్యాంక్ సంక్షోభం వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ ఐటీ వింగ్ విమర్శించింది.

ఈ పెయింటింగ్ పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఆ పెయింటింగ్ ను ప్రియాకం ఏ దాచలేదు. 2010లో ఐటీకి ఆ విషయం తెలిపారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. ఆ ఆరోపణలను మరో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్ దీప్ సింగ్ సుర్జేవాలా కొట్టిపారేశారు. ఎస్ బ్యాంక్ సంక్షోభం నుంచి ప్రజల ఫోకస్ మళ్లించాలని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ విధంగా ఒక పెయింటింగ్ పై రెండు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి.
Tags:    

Similar News